పవన్ చిత్రం టైటిల్ కోసం రచ్చ, చర్చ
ఈ నేఫధ్యంలో ఈ చిత్రానికి ఇప్పటివరకూ ఏ టైటిలూ ఫిక్స్ చేయలేదని,త్వరలోనే టైటిల్ ఫిక్స్ చేయనున్నారని త్రివిక్రమ్ సన్నిహితుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇక 'జల్సా' తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తున్న సినిమా ఇదే కావటం కూడా విపరీతమైన క్రేజ్ కు కారణమైంది. ఈ సినిమా మొదలైనప్పట్నుంచీ టైటిల్ విషయంలో రకరకాల ఊహాగానాలు. 'హరేరామ హరేకృష్ణ' అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టనున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.
ఈ మధ్య 'సరదా' అనే టైటిల్ ఖరారైనట్లు చెప్పుకున్నారు. ఇప్పుడు 'అత్తారింటికి దారేది' అని మరో కొత్త టైటిల్ ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. అయితే... ఈ సినిమాకు ఇప్పటివరకూ ఏ టైటిల్ అనుకోలేదన్నది విశ్వసనీయ సమాచారం. ఇటీవలే హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో వేసిన సెట్‌లో ఈ సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్‌ను చిత్రీకరించారు.
మరో షెడ్యూల్ కోసం నేడో రేపో యూనిట్ సభ్యులు స్పెయిన్ బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు టైటిల్‌ని ఖరారు చేయడానికి పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నారు. వచ్చేనెల్లో ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications












