శ్రీదేవి, శ్రియ.. ఎవరినీ కలవలేదు: మోహన్ బాబు
మోహన్ బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'రావణ' చిత్రంపై ఇటీవల రకరకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం మోహన్ బాబు సరసన నటింపజేసేందుకు ఆయన తనయుడు విష్ణు శ్రీదేవిని సంప్రదించాడని, అయితే ఆమె కోటిన్నర రెమ్యూనరేషన్ అడగటంతో విష్ణు ఆ ప్రయత్నం విరమించుకున్నారని గాసిప్స్ వెలువడ్డాయి.
నిన్నటికి నిన్న....హీరోయిన్ శ్రియ ఈ చిత్రంలో అప్పర పాత్రలో నటించబోతోందని, ఇందులో ఆమె పాత్ర నెగెటివ్‌గా ఉంటుందని ప్రచారం జరుగుతోందని పాఠకులకు ఇప్పటికే తెలియజేశాం. అయితే ఈ వార్తలను మోహన్ బాబు తాజాగా ఖండించారు.
రావణ చిత్రం కోసం తాము ఇప్పటి వరకు ఎవరినీ సంప్రదించ లేదని....శ్రీదేవిని, శ్రియను సంప్రదించినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఈ చిత్రాన్ని విష్ణు ప్రొడ్యూష్ చేస్తున్నాడు. త్వరలోనే ఈచిత్రం నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు తెలియజేస్తాం అన్నారు.
ఈ సినిమాలో విజువల్ ఎఫ్ఫెక్ట్స్ కి పెద్ద పీట వేయనున్నట్టు మోహన్ బాబు చెప్పారు. గతంలోఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి మహానుభావులు రావణాసురుడి పాత్రను పోషించి మెప్పించారనీ ... తనదైన శైలిలో ఈ పాత్రను రక్తి కట్టించడానికి ప్రయత్నిస్తానని అన్నారు. అధునాతనమైన 3 డి పరిజ్ఞానంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో, భారతీయ సినీపరిశ్రమలోని ప్రముఖ నటీనటులంతా నటిస్తారని చెప్పారు. గతంలో రాఘవేంద్ర రావు - మోహన్ బాబు కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్స్ వచ్చాయి. ఈ సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందనీ ... 'రావణ'గా మోహన్ బాబు తన విశ్వ రూపాన్ని చూపించడం ఖాయమని టాలీవుడ్ సినీజనాలు అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











