డిసెంబర్ 31 వరకు మహేష్ ఫ్యాన్స్ కు నిరాశే!
తమ అభిమాన తారల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనే కోరితో ఉంటారు ఫ్యాన్స్. అందుకే వారిని ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఫాలో అవుతూ ఉంటారు. హాలీవుడ్, బాలీవుడ్ మాదిరి మన టాలీవుడ్ లోనూ పలువురు సినిమా సెలబ్రిటీలు ఎప్పటికప్పడు తమ అభిప్రాయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ వారిని ఉత్సాహ పరుస్తూ ఉన్నారు కూడా. వారిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఆయన తన ట్విట్టర్ లో చేసే కామెంట్ల కోసం అభిమానులు తరచూ ఆసక్తిగా చూస్తూనే ఉంటారు. ఉంటే వాటిని చదవిని సంబర పడిపోవడం, లేక పోతే నిరాశ పడటం అభిమానులకు కొత్తేమీ కాదు.
అయితే మహేష్ బాబు అభిమానులకు మరో నెల రోజులకు పైగా నిరాశ తప్పేట్లు కనిపించడం లేదు. కారణం డిసెంబర్ 31 వరకు మహేష్ బాబు సైలెంట్ గా ఉండాలని నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం. దూకుడు సినిమా రిలీజ్ తర్వాత ఆ సినిమా టీమ్ కు ట్విట్టర్ ద్వారా విషెష్ చెప్పిన మహేష్ బాబు, ఆ సినిమా 50 రోజులకు చేరే వరకు ఎలాంటి పోస్టులు తన ట్విట్టర్ లో చేయలేదు. 50వ రోజు రాగేనే ఈరోజు దూకుడు 50వ రోజు, ఈ విజయానికి కారణమైన అభిమానులకు, సినిమా టీంకు థ్యాంక్స్ చెప్పి మళ్లీ సైలెంట్ అయ్యాడు. మళ్లీ మహేష్ కామెంట్లు దూకుడు 100 రోజులకు చేరిన తర్వాతే ఉంటాయంటున్నారు. డిసెంబర్ 31న దూకుడు సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంటోంది. అప్పటి వరకు అభిమానులు ఆగాల్సిందే మరి.


Click it and Unblock the Notifications











