Don't Miss!
- Sports
అతన్ని ఆర్సీబీ అనవసరంగా రిటైన్ చేసుకుంది: పార్థీవ్ పటేల్
- News
బీజేపీ కోసం తెలంగాణలో పవన్‌కల్యాణ్ రాజకీయం??
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ ఫ్యాన్స్ కి నిరాశ.. తమన్ ఊరించిన కాసేపటికే మరో షాకింగ్ న్యూస్.. ఇక లేనట్టే?
మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా యూనిట్ అధికారికంగా సాడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే

భారీ అంచనా
మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ల మీద సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది.

సంక్రాంతి నుంచి
అయితే అప్పటికే రాజమౌళి RRR కోసం సినిమాని వాయిదా వేసుకోవాలని కోరడంతో పాటు మహేష్ బాబు ఆరోగ్యరీత్యా సినిమా షూటింగ్ మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో సినిమాను వాయిదా వేసుకోవాలని నిర్మాతలు భావించారు. అందులో భాగంగానే సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీ 2022 వ తేదీన విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి నుంచి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్లను వరుసగా ప్రకటిస్తామని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

చివరి చూపు కోసం
కానీ ఇప్పుడు అభిమానులకు ఆ ఆనందం కూడా లేకుండా చేసినట్లయింది. సర్కారు వారి పాట మేకర్స్ అప్‌డేట్‌లను రోజురోజుకు ఆలస్యం చేస్తుండడం మహేష్ అభిమానుల ఆతృతను పెంచుతోంది. గత కొన్ని రోజులుగా సూపర్ స్టార్ అభిమానులు మహేష్ విషయంలో చాలా బాధ పడుతున్నారు. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడటమే కాక ఆయన సోదరుడు చనిపోతే కనీసం చివరి చూపు కోసం కూడా వెళ్ల లేకపోయారు అని ఆయన ఫ్యాన్స్ అందరూ బాధ లో ఉన్నారు.
|
ఏప్రిల్ ఒకటో తేదీన
అప్పటికి మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న మహేష్ రెస్ట్ తీసుకుంటారు అని భావిస్తే కరోనా రావడంతో అభిమానులు అందరూ బాధలో మునిగిపోయారు. ఇప్పుడు సినిమా ప్రకటించిన సమయానికి వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. అయితే వీటన్నింటికి చెక్ పెట్టే విధంగా సంక్రాంతి నుంచి కనుక వరుస అప్డేట్స్ వచ్చినట్లయితే సినిమా ఖచ్చితంగా ప్రకటించిన ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల అవుతుందని అందరూ భావించారు.
|
మరింత ఆలస్యం
కానీ ఇప్పుడు ఈ అప్ డేట్స్ విషయంలో కూడా షాక్ తగిలింది. సంగీత దర్శకుడు SS థమన్ తాజాగా తన ట్విట్టర్‌లో సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ గురించి చుకున్నారు. ఫస్ట్ సింగిల్ కోసం టీమ్ వర్క్ చేస్తోందని, ఫస్ట్ సింగిల్‌కి సంబంధించి త్వరలో అప్‌డేట్ వస్తుందని ట్వీట్ చేశాడు. అయితే అభిమానులు ఈ విషయం మీద ఆనంద పడేలోపే సర్కారు వారి పాట నిర్మాతలు కోవిడ్ మరియు ప్రస్తుత పరిస్థితి కారణంగా సినిమా అప్డేట్స్ లో మరింత ఆలస్యం అవుతుందని పేర్కొంటూ ఒక నోట్ ను విడుదల చేశారు.

మరింత బాధ పడేలా
ఈ వార్త ఇప్పుడు అభిమానులు మరింత బాధ పడేలా చేస్తోంది. ఎందుకంటే పండుకకు ఎదో ఒక అప్డేట్ వస్తుందని అందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఇలా జారగడంతో వారంతా సినిమా రిలీజ్ గురించి కూడా భయపడుతున్నారు. ఇక కచ్చితంగా ఏప్రిల్ 1 నుంచి సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని యూనిట్ చెబుతుంది కానీ సర్కారు వారి పాట టీమ్ ఇప్పుడు ఆగస్టు 5న విడుదల చేయాలని ఆలోచిస్తోందని ప్రచారం అయితే జరుగుతోంది.