‘గబ్బర్ సింగ్’ మీద అది రూమరే నమ్మొద్దు
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'గబ్బర్ సింగ్' విడుదలైన నాటి నుంచీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం బేస్ చేసుకుని ఓ వీడియో గేమ్ అందుబాటులోకి తేవాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు హైదరాబాద్, చెన్నయ్‌లలోని ప్రముఖ గేమింగ్ కంపెనీలను సంప్రదిస్తున్నట్లు కూడా మీడియాలో ప్రచారం జరిగింది. సినిమా మాదిరే సాగే ఈ గేమ్‌లో 'గబ్బర్ సింగ్'ను మనం కంట్రోల్ చేస్తూ మజా చేయొచ్చని హంగామాగా చెప్పారు. అయితే అవన్నీ రూమర్సే నని అలాంటి ఆలోచన ఏదీ లేదని తెలిసింది.
ఈ విషయమై నిర్మాత గణేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ...మేం ఎవరితోనూ వీడియో గేమ్ విషయమై మీటింగ్ లు జరపలేదు. అలాంటి ఆలోచన కూడా ఏమీ లేదు. అయితే ఈ చిత్రాన్ని మరింతగా ప్రమోట్ చేయటానికి మాకంటూ మరిన్ని ప్లాన్స్ ఉన్నాయి. అతి త్వరలోనే వాటిని తెలుపుతాం. ఇప్పటికే ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్ తో దూసుకువెళ్తోంది. అయితే ఈ చిత్రాన్ని అన్ బీటబుల్ ఆల్ టైమ్ గ్రాసర్ గా మార్చాలని మేం మరిన్ని కొత్త ఇన్నోవేటివ్ ఆలోచనలతో ముందుకు వద్దామనే ఆలోచనలో ఉన్నాం. వీటి నిమిత్తం మా దర్శకుడుతో,హీరోతో చర్చిస్తున్నాం అన్నారు.
పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం హిస్టారికల్ మాస్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. విడుదలైన 10 రోజుల్లోనే 50 కోట్లకు పై చిలుకు వసూళ్లు సాధించి తెలుగు సినిమా రికార్డుల చరిత్రను తిగరాసింది. 'గబ్బర్ సింగ్'క్రేజ్ మరింత పెంచేందుకు నిర్మాతల సరికొత్త ఆలోచనలో ముందుకు వస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











