‘నిప్పు’ యాక్షన్ మూవీనే కానీ... నో హింస
రవితేజ-గుణశేఖర్ కాంబినేషన్లో వైవిఎస్ చౌదరి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న 'నిప్పు' సినిమా ఫిబ్రవరి 2న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఆడియో రిలీజ్ చేయనున్న సందర్భంగా నిర్మాత వైవిఎస్ చౌదరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి చిత్ర వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ....''రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌ని మిస్ చేయకుండా తనదైన శైలిలో గుణశేఖర్ తెరకెక్కించిన 'నిప్పు' పూర్తి సంతృప్తినిచ్చింది. గత ఏడాది చివర్లో రష్ చూశాను. అద్భుతంగా వచ్చింది. 'నిప్పు' టైటిల్ రవితేజ కేరక్టరైజేషన్‌కి అనుగుణంగా పెట్టిన టైటిల్. ఇందులో మంచి యాక్షన్ ఉంది కానీ వయొలెన్స్(హింస) ఉండదు. రవితేజ పెర్ఫార్మెన్స్, రాజేంద్రప్రసాద్ చేసిన పాత్ర, దీక్షాసేథ్ అందం, అభినయం, సెంటిమెంట్… ఇలా ఈ చిత్రానికి అన్నీ బాగా కుదిరాయి'' అన్నారు. రవితేజ పుట్టినరోజు పురస్కరించుకుని జనవరి 26న డిస్క్ ఫంక్షన్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈచిత్రానికి మాటల్ : ఆకుల శివ, శ్రీధర్ సీపాన, ఫైట్స్ కనల్‌కణ్ణన్, సంగీతం : తమన్, సహనిర్మాతలు: యుక్తాచౌదరి, ఏక్తాచౌదరి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎస్.ఆర్.కిషోర్, ఎస్.ఎస్.కిరణ్.


Click it and Unblock the Notifications











