»   » అది చూసాక నన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు: రానా

అది చూసాక నన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు: రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు నత్తనడకన సాగిన తెలుగు నటుడు రానా కెరీర్ ఇపుడు ఓ రేంజి స్పీడులో దూసుకోలుతోంది. ఇటీవలే రానా నటించిన ‘బాహుబలి' చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు అందులో ఆయన పోషిచిన భల్లాలదేవ పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందాయి.

బాహుబలి-2 షూటింగ్ గ్యాపులో మళయాలంలో హిట్టయిన బెంగుళూర్ డేస్ తమిళ రీమేక్ ‘బెంగుళూరు నాట్కల్' సినిమాలో నటించిన రానా మరో హిట్టు తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్లలో బిజీగా ఉన్న రానా పెళ్లి ఎప్పుడు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

No woman will marry me: Rana Daggubati

ప్రస్తుతం తాను చాలా సినిమాలకు కమిట్ అయ్యాను..అవన్నీ పూర్తయ్యాకే పెళ్లి గురించి ఆలోచిస్తాను అని తెలిపారు. బాహుబలి-2లో తాను చేసిన క్రూరమైన పాత్ర చూసిన తర్వాత ఏ అమ్మాయి తనను పెళ్లి చేసుకోదేమో.... అంటూ వ్యాఖ్యాపించారు. బాహుబలి కంటే బాహుబలి-2 ని రాజమౌళి ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారని, ఇందులో వచ్చే గ్రాఫిక్స్‌, సెట్టింగ్స్‌, యుద్ధ సన్నివేశాలు బాహుబలి కంటే 100 రెట్లు బాగుంటాయని వాఖ్యానించాడు.

రానా చెప్పే విషయాలను బట్టి ‘బాహుబలి-2' ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక రానా నటించిన తమిళ చిత్రం ‘బెంగుళూరు నాట్కల్' విషయానికొస్తే పివిపి సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రానాతో పాటు బాబీ సింహా, శ్రీ దివ్య, సమంత, పార్వతి, లక్ష్మిరాయ్, ప్రకాష్ నటించారు. ప్రస్తుతం రానా తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి-2', శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లీడర్' సీక్వెల్, సబ్ మెరైన్ కాన్సెప్టుతో తెరకెక్కుతున్న వార్ మూవీతో పాటు తమిళంలో బాల దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు.

English summary
Rana said, no woman would show interest on him post Baahubali 2 as he is portrayed in a terrified avatar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu