»   »  తప్ఫేముంది కత్రినా

తప్ఫేముంది కత్రినా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Katrina Kaif
'మల్లీశ్వరి' గా తెలుగు వారికి పరిచయమైన బాలీవుడ్ బ్యూటి కత్రినా కైఫ్‌ .చాలా కాలంగా ఆమె సల్మాన్ ఖాన్ తో నడుపుతున్న ప్రేమాయణం ఒక కొలిక్కి వచ్చినట్లే నని త్వరలో ఇద్దరూ అత్యంత సన్నిహితులు సమక్షంలో అఫిషియల్ గా పెళ్లి చేసుకోబోతున్నారనీ వార్తలు అంతటా వినిపిస్తున్నాయి.దాంతో ఆమె వివరణ కోసం కలిసిన మీడియాను క్రిందటి సారి లాగే కొట్టి పారేసిందామె.అలాంటిదేమీ లేదంటూ అంటూ వాదానికి దిగుతోందిట.' ఈ సంవత్సరం ఒక్క రోజు కూడా నా డైరీలో ఖాళీ లేదు. సినిమాలతో బిజీగా వున్నాను..కొంతమంది కావాలని ఈ రూమర్స్ పుట్టించారు..'సల్మాన్ గానీ తాను గాని తమ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడక పోవటంతో' ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని భాధగా చెప్తోందిట .ఆమె చెప్పింది బాగానే ఉంది గాని.. ప్రేమికుడు తోనే కదా పెళ్ళి అయిందా అని అడుగుతున్నాము. పోనీ వేరే రకమైన పుకార్లు కూడా కావు .ఇందులో ఇంత ఎమోషన్ ఫీలవటానికి ఏముంది. 'అప్పుడే పెళ్ళేంటి ఛీ పాడు!' అని సిగ్గుతో ఫీలవుతున్నారేమో అనుకుందామనుకున్నా ఇద్దరూ పెళ్ళీడు కొచ్చిన వారే కదా! అని వాపోతున్నారు అడిగిన వాళ్ళు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X