Oscars 2023 ఆయన ఉమ్మేశాడా? యాంకర్ తింగరి ప్రశ్న.. మలాలా దిమ్మతిరిగేలా జవాబు

ఆస్కార్ అవార్డులంటే.. తారలు, వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖుల వెలుగు జిలుగులతో వేదిక కన్నుల పండువగా మారుతుంది. ఆసక్తికరమైన సంఘటనలు, భావోద్వేగ సన్నివేశాలతోపాటు వివాదాస్పద అంశాలు కూడా ఆస్కార్ అవార్డుల్లో కనిపిస్తాయి. ప్రతీసారి మాదిరిగానే ఈ సారి కూడా అవార్డుల కార్యక్రమంలో చిన్న వివాదాస్పద అంశం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. నోబెల్ పురస్కార గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ను హోస్ట్ జిమ్మ కిమ్మెల్ అడిగిన ప్రశ్నపై నెటిజన్లు గరం అవుతున్నారు. ఆ వివాద వివరాల్లోకి వెళితే..

హోస్ట్ జిమ్మి కిమ్మెల్ ప్రముఖులతో మాట్లాడుతూ.. మలాలా వద్దకు వెళ్లారు. మలాలా గురించి మాట్లాడుతూ.. చరిత్రలో నీవు నోబెల్ ప్రైజ్ విన్నర్.. అందుకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. క్రిస్ పైన్ మీద హ్యారీ స్టైల్స్ ఉమ్మి వేశాడని మీరు భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు.. నేను కేవలం శాంతి గురించే మాట్లాడుతాను అంటూ మలాలా ఘాటుగా సమాధానం చెప్పింది.

Nobel peace winner Malala Yousafzai befitting reply to Anchor Jimmy Kimmel at Oscars 2023

కొద్ది రోజుల క్రితం అమెరికన్ సింగర్, రచయిత హ్యారీ స్టైల్స్ వివాదంలో కూరుకుపోయారు. గ్రామీ అవార్డు విజేతగా నిలిచిన ఆయన.. వెనీస్‌లో జరిగిన డోంట్ వరీ డార్లింగ్ ప్రీమియర్ సందర్భంగా అమెరికన్ యాక్టర్ క్రిస్ పైల్‌పై ఉమ్మి వేశారనే విషయం అత్యంత విషాదంగా మారింది.

డోంట్ వరీ డార్లింగ్ దర్శకులు ఓలివియా వైల్డ్ ఈ గొడవపై స్పందించారు. వెనీస్ ప్రీమియర్ సంరద్భంగా జరిగిన వివాద ఘటనపై ఆమె వివరాలు వెల్లడిస్తూ.. క్రిస్ పైల్‌పై హ్యారీ స్టైల్స్ ఉమ్మివేయలేదని చెప్పారు. దాంతో ఆ వివాదానికి పరిష్కారం లభించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X