twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా ఆయన తప్ప.., ఎవరైతే బాగుంటుందని: అక్షయ్ భార్య ఇంట్రెస్టింగ్..

    |

    ముదురు వయసులోనూ.. డ్యూయెట్లు, యాక్షన్ సీన్లతో విరుచుకుపడే తెలుగు హీరోల కంటే బాలీవుడ్ హీరోలు వంద శాతం నయమనిపిస్తుంటుంది.

    సామాజిక ఇతివృత్తాలతో కూడిన సినిమాలు చేయడానికి వారు వెనుకాడరు. హీరో అంటే వీరుడు, శూరుడు, ఆకాశం నుంచి ఊడిపడ్డవాడు.. లాంటి మూస ధోరణికి వాళ్లెప్పుడో చెక్ పెట్టారు. కాబట్టే 'ప్యాడ్ మ్యాన్' లాంటి సినిమాలు అక్కడ తెరకెక్కుతున్నాయి.

    దేశంలో ఆయనో విప్లవం: కోట్ల మంది మహిళలకు భరోసానిచ్చిన మహనీయుడు..

    ఈ నేపథ్యంలో ప్యాడ్ మ్యాన్ హీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

     మా ఆయన తప్ప:

    మా ఆయన తప్ప:

    ప్యాడ్ మ్యాన్ లాంటి సినిమాలో అక్షయ్ కుమార్ తప్ప మరొకరు నటించలేరని ట్వింకిల్ అభిప్రాయపడ్డారు. 'సినిమాలో ప్రధాన పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో.. దర్శకుడు బాల్కీ అక్షయ్‌ని ఎంపికచేసుకున్నారు. ఆ తర్వాత ఇలాంటి పాత్ర అక్షయ్ మాత్రమే చేయగలుగుతారు అనిపించింది.' అన్నారు. ముంబైలో 'ప్యాడ్ మ్యాన్' సాంగ్ 'ఆజ్ సే తేరీ' విడుదల సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

     పాఠశాలల్లో ప్రదర్శించేలా:

    పాఠశాలల్లో ప్రదర్శించేలా:

    సామాజిక ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం కావడం.. సానిటరీ ప్యాడ్స్ ఉపయోగంపై మహిళల్లో విస్తృత స్థాయి చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉండటంతో ఈ సినిమాను వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు ట్వింకిల్.

    ఈ మేరకు ఇప్పటికే ఆయా మంత్రులతో మాట్లాడి.. పాఠశాలల్లో ఈ సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

     మహిళల సమస్యపై:

    మహిళల సమస్యపై:

    మనదేశంలో నూటికి ఎనభై మంది పేదలు. మధ్య తరగతి స్త్రీల సంగతి పక్కనబెడితే.. పేద వర్గాల స్త్రీలు వ్యక్తిగతంగా చాలా సమస్యలను అనుభవిస్తున్నారు. అందులో ప్రధానమైనది రుతుస్రావం సమయంలో వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య. పూట గడవడమే కష్టమైన పరిస్థితుల్లో సానిటరీ ప్యాడ్స్ కొనుక్కోవడం కూడా వారికి కష్టంగానే మారింది.

    సామాజిక ఇతివృత్తం:

    సామాజిక ఇతివృత్తం:

    మార్కెట్లో ఉన్న సానిటరీ ప్యాడ్స్ చౌక ధరకు అందుబాటులో లేకపోవడం.. ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న పేద కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. రుతుస్రావం సమయంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవి వారి ఆరోగ్యంపై తీవ్ర దుష్ఫలితాలను చూపిస్తున్నాయి.

    మళ్లీ రెచ్చిపోయిన రాధికా: బోల్డ్ ఫోటో షూట్.. హాట్ హాట్‌గా..మళ్లీ రెచ్చిపోయిన రాధికా: బోల్డ్ ఫోటో షూట్.. హాట్ హాట్‌గా..

     మౌనాన్ని బద్దలుకొట్టి:

    మౌనాన్ని బద్దలుకొట్టి:

    ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అబ్బాయి.. రుతుస్రావం సమస్యల గురించి తల్లితోనో.. చెల్లితోనో మాట్లాడితే.. అంతకంటే ఘోరం మరొకటి లేదనుకునే సమాజం మనది. అలాంటి పరిస్థితుల్లో అరుణాచలం మురుగనాథం అనే ఓ వ్యక్తి ఈ నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టాడు. ఎన్నో కష్ట నష్టాలు, ఛీత్కారాలు, అవమానాలకు ఓర్చి పేద, మధ్య తరగతి మహిళల కోసం సానిటరీ ప్యాడ్స్ తయారుచేశాడు. ఆయన కథ ఆధారంగా రూపుదిద్దుకున్నదే 'ప్యాడ్ మ్యాన్'.

    ఇండియాకు 'ప్యాడ్ మ్యాన్'

    అమెరికాకు సూపర్ మ్యాన్.. స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ లాంటి సూపర్ హీరోలుంటే మన దేశానికి 'ప్యాడ్ మ్యాన్' అంటూ ట్రైలర్ లో అమితాబ్ బచ్చన్ చెప్పిన వాయిస్ ఓవర్ ఇప్పటికే చాలామందిని ఆకట్టుకుంది. సినిమాలో అక్షయ్ కుమార్ భార్యగా రాధికా ఆప్టే నటిస్తుండగా.. సోనమ్ కపూర్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

    English summary
    At the launch of PadMan song Aaj Se Teri in Mumbai, Twinkle Khanna said that while she had a few other names in mind for the lead role in the R Balki directorial, nobody could do what Akshay Kumar has done in the film.'
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X