దుబాయ్ ప్రెస్‌మీట్ హైలెట్స్: జీవితంలో నటిస్తే డబ్బు ఇవ్వరన్న రజనీకాంత్

నిజ జీవితంలో నటిస్తే తనకు ఎవరూ డబ్బు ఇవ్వరని, అందుకే సింపుల్ గా ఉంటానని రజనీకాంత్ తెలిపారు.

By Bojja Kumar

Recommended Video

Rajini 2.0 Movie Press Meet @ Dubai Gallery 2.0 ఫీవర్ మొదలైంది

'నిజ జీవితంలో నటిస్తే నాకు ఎవ్వరూ డబ్బులు. అందుకే సినిమాల్లో మాత్రమే నటిస్తాను, రియల్ లైఫ్‌లో సింపుల్‌గా ఉంటా' అంటూ 2.0 మూవీ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్లో రజనీకాంత్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. శుక్రవారం దుబాయ్‌లో 2.0 ఆడియో వేడుక జరుగనున్న నేపథ్యంలో రజనీకాంత్ అండ్ 2.0 టీం గురువారం దుబాయ్ లోని బుర్జ్ ఆల్ అరబ్ వద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ ప్రెస్ మీట్‌కు ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిధులు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు రజనీకాంత్ అండ్ టీం హుందాగా సమధానాలు ఇచ్చారు. మరి వారు అడిగిన ప్రశ్నలేమిటి? 2.0 టీమ్ సమాధానాలేమిటో ఓ సారి లుక్కేద్దాం.

నిజ జీవితంలో నటిస్తే నాకు ఎవరూ డబ్బు ఇవ్వరు

నిజ జీవితంలో నటిస్తే నాకు ఎవరూ డబ్బు ఇవ్వరు

మీరు ఇంత సింపుల్‌గా ఎలా ఉంటారు సర్‌..... అంటూ ఓ విలేకరి రజనీకాంత్‌ను ప్రశ్నించగా, ‘నిజ జీవితంలో నటించమని నాకు ఎవ్వరూ డబ్బు ఇవ్వరు. అందుకే సింపుల్‌గా ఉంటా' అని రజనీకాంత్ సమాధానం ఇచ్చారు.

రజనీ అండ్ టీంకు రిపోర్టర్ల స్డాండింగ్ ఓవేషన్

రజనీ అండ్ టీంకు రిపోర్టర్ల స్డాండింగ్ ఓవేషన్

దుబాయ్ సముద్రం తీరంలో ఉన్న ఎత్తైన కట్టడం బుర్జ్ ఆల్ అరబ్‌లో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. రజనీ అండ్ టీం ప్రత్యేక హెలికాప్టర్లో బుర్జ్ ఆల్ అరబ్‌ టవర్ పైన ఉన్న హెలిప్యాడ్ మీద ల్యాండ్ అయ్యారు. వారికి బుర్జ్ ఆల్ అరబ్‌ ప్రతినిధులు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఇక ప్రెస్ కాన్ఫరెన్స్ హాలులోకి రజనీకాంత్ ఎంటరవ్వగానే రిపోర్టర్లంతా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.

ఇది సీక్వెల్ అస్సలు కాదు

ఇది సీక్వెల్ అస్సలు కాదు

2010లో వచ్చిన రోబో చిత్రానికి ఇది సీక్వెల్ కాదని, 2.0 మూవీ ఓ కొత్త కథతో రూపొందించామని, ఇదో సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా మంచి సందేశాత్మక చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు శంకర్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

అక్షయ్ కుమార్ పాత్రలో చాలా షేడ్స్

అక్షయ్ కుమార్ పాత్రలో చాలా షేడ్స్

అక్షయ్‌కుమార్‌ ఈ చిత్రంలో కేవలం విలన్ పాత్రలో మాత్రమే కాదు, ఆయన క్యారెక్టర్‌ను చాలా షేడ్స్‌లో చూపించబోతున్నాం. ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్ మేకప్‌ విషయంలో చాలా కష్టపడ్డారు. ఆయన పాత్రకు మేకప్ వేయడానికి మూడున్నర గంటలు పట్టేది. ఇక తొలగించడానికి గంటన్నర పట్టేది, ఇందుకోసం ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్టులను రప్పించినట్లు దర్శకుడు శంకర్ తెలిపారు.

ఆర్నాల్డ్‌ను అందుకే తీసుకోవాలనుకున్నాం, కానీ...

ఆర్నాల్డ్‌ను అందుకే తీసుకోవాలనుకున్నాం, కానీ...

ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కంటే ముందు విలన్ పాత్రలో హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్‌ను తీసుకోవాలనుకున్నారు. పలు కారణాలతో ఆయన ఈ ప్రాజెక్టులోకి రాలేదు. ఈ విషయమై ఎదురైన ప్రశ్నకు దర్శకుడు శంకర్ స్పందిస్తూ... ‘2.0' హాలీవుడ్‌ చిత్రంలా ఉంటుంది. కానీ పూర్తి తరహా హాలీవుడ్‌ చిత్రం అని అనుకోవద్దు. ప్రపంచానికి ఈ సినిమా స్క్రిప్ట్‌ నచ్చుతుంది. అందుకే ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌ను తీసుకోవాలనుకున్నామని తెలిపారు.

రజనీ సర్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టం

రజనీ సర్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టం

రజనీ సర్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కడం నా అదృష్టమని, ఆయన ఒక స్టార్‌గా ఎంత ఎత్తుకు ఎదిగినా చాలా సింపుల్ గా ఉంటారు, ఆయన వద్ద నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయనతో మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను అని అక్షయ్ కుమార్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

సినిమాలో ఒకటే పాట

సినిమాలో ఒకటే పాట

2.0 సినిమా కోసం మొత్తం 3 పాటలు కంపోజ్ చేశాను. కానీ సినిమాలో చూపించేది కేవలం ఒక పాట మాత్రమే. మిగతా రెండు పాటలు రేపు ఆడియో రిలీజ్ వేడుకలో తాను లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తెలిపారు.

నా క్యారెక్టర్ నెవర్ బిఫోర్

నా క్యారెక్టర్ నెవర్ బిఫోర్

2.0 మూవీ సంటిఫిక్ థ్రిల్లర్‍‌గా, ఒక మంచి సందేశాత్మక చిత్రంగా ఉంటుందని, తన క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని అమీ జాక్సన్ తెలిపారు.

వరల్డ్ మూవీ

వరల్డ్ మూవీ

ఇండియన్ సినిమా పరిశ్రమ నుండి ప్రపంచ స్థాయి సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటారు. అలాంటి సినిమాల్లో 2.0 చిత్రాన్ని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. భారీ తారాగణంతో పాటు హయ్యెస్ట్ బడ్జెట్ రూ. 450 కోట్లు ఖర్చు పెట్టి ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు.

ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకే

ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకే

త్వరలో రాబోతున్న ఈ ప్రపంచ స్థాయి సినిమా గురించి ప్రపంచ మొత్తానికి తెలియాలనే ఉద్దేశ్యంతోనే 2.0 మూవీ ఆడియో రిలీజ్ వేడుక దుబాయ్ లో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంటు కోసం రూ. 12 కోట్లు ఖర్చు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X