అది చూస్తే...ఆ హీరోయిన్‌ను ఎవరూ పెళ్లి చేసుకోరట!

By Bojja Kumar

హైదరాబాద్: ఇటీవల 'క్వీన్' అనే చిత్రంలో తన పెర్ఫార్మెన్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్....తాజాగా 'రివాల్వర్ రాణి' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా చూసిన తర్వాత తనను ఎవరూ పెళ్లి చేసుకోరని ఆమె వ్యాఖ్యానించారు.

'రివాల్వర్ రాణి' చిత్రం ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ...'ఈ సినిమా చూసిన తర్వాత నన్నె పెళ్లి చేసుకోవడానికి ఎవరూ సాహసించరను. కావాలంటే రాసిస్తాను' అని కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. మరి అంత భయపడేంతగా కంగనా రనౌత్ ఈచిత్రంలో ఏం చూపెట్టిందో ఏమో?

Nobody will marry me after watching 'Revolver Rani': Kangana Ranaut

కంగనా రనౌత్ నటించిన 'క్వీన్' చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం విడుదల తేదీకి నాలుగు నెలల గ్యాపుతో త్వరలో 'రివాల్వర్ రాణి' చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 'క్వీన్ చిత్రం ఇప్పటికీ రన్ అవుతోంది. దానికి కారణం ప్రేక్షకులకు ఈచిత్రంలో నా పెర్ఫార్మెన్స్ నచ్చడమే. వ్యక్తిగతంగా కూడా నాకు ఎంతో నచ్చిన పాత్ర ఇది. క్వీన్ చిత్రం మాదిరిగానే రివాల్వర్ రాణి చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని తెలిపారు కంగనా.

'రివాల్వర్ రాణి' అనేది ఒక అసాధారణ చిత్రం, సినిమా కాన్సెప్టు, స్టోరీ, తెరకెక్కించిన తీరు ...ఇలా ప్రతి విషయం భిన్నంగా ఉంటుందని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి సాయి కబీర్ దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X