తనను బికినీలో చూడలేరంటున్న భావన
తాను బికినీ వేసుకుంటే ఎవరూ చూడలేరని, ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం కూడా లేదని అంటోంది అందాల మలయాళీ భామ భావన. ఒంటరి చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ హీరోయిన్ నితిన్ తోనూ, శ్రీకాంత్ తోనూ నటించింది. అయితే ఆమెను తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేకపోయారు. హోమ్లీగా కనిపించే భావన మీరు ట్రెండ్ మార్చి గ్లామర్ గా కనిపించవచ్చు కదా అని అంటే తాను సెక్సీగా నటించబోనని, తన గురించి తనకు తెలుసునని, తాను సెక్సీ కెటగిరీలోకి రానని, బికినీ క్లబ్ లో కూడా చేరని ఘాటుగానే చెప్పింది. అయితే ఈ మధ్య కాస్తా డిజైనింగ్ విషయంలో మార్పు చేశానని, అందుకే కాస్తా ట్రెండీ లుక్స్ లో కనిపిస్తున్నానని భావన అంటోంది.


Click it and Unblock the Notifications











