దీప్తి సునయన అలాంటిది కాదు.. నోయల్ సెన్సేషనల్ కామెంట్స్
బిగ్ బాస్ షో నాల్గో సీజన్ సందడి సోషల్ మీడియాలో ఇంకా కొనసాగుతూనే ఉంది. షో ముగిసినా కూడా కంటెస్టెంట్లు మాత్రం ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంటున్నారు. ప్రతీ ఒక్కరూ తమ తమ పనులతో బిజీ అయిపోయారు. కొందరు యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఇంకొందరు ఇంటర్వ్యూలు ఇస్తూ సెన్సేషనల్ అవుతున్నారు. కొందరు సినిమా ఆఫర్లు వస్తుండటంతో హల్చల్ చేస్తున్నారు.

లాస్య అలా..
బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లో లాస్య ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. తన యూట్యూబ్ చానెల్, స్పెషల్ వీడియోలు, ఇంటర్వ్యూలు మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడంతో బాగానే ట్రెండింగ్‌లోకి వచ్చింది. అంతే కాకుండా లాస్యయూట్యూబ్ చానెల్ హ్యాక్ అవ్వడంతో మరింత సెన్సేషనల్ అయింది.

తిరిగొచ్చిన చానెల్..
లాస్య యూట్యూబ్ చానెల్ అలా హ్యాక్ పెద్ద దుమారాన్ని రేపింది. సోషల్ మీడియాలో లాస్య ఎమోషనల్ అవ్వడం, తన యూట్యూబ్ చానెల్ హ్యాక్ అయిందంటూ ఫేస్ బుక్‌లో లాస్య పెట్టిన ఎమోషనల్ పోస్ట్ బాగా వైరల్ అయింది. చివరకు రెండు రోజుల్లోపే లాస్య యూట్యూబ్ చానెల్ తిరిగి వచ్చేసింది. దాంతో ఎగిరి గంతులేసింది.
Recommended Video

స్పెషల్ ఇంటర్వ్యూలు..
ఇప్పుడు లాస్య తన యూట్యూబ్ చానెల్ మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు ట్రై చేస్తోంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా లాస్యసెలెబ్రిటీలను సైతం ఇంటర్వ్యూలు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే అల్లుడు అదుర్స్ టీంతో లాస్య చిట్ చాట్ చేసింది.

తాజాగా నోయల్‌తో..
లాస్య తన యూట్యూబ్ చానెల్ హ్యాకర్స్ నుంచి తిరిగి వచ్చిన తరువాత నోయల్‌తో ఇంటర్వ్యూ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. మామూలుగా అయితే నోభికస్యతో ఓ స్పెషల్ వీడియోను ప్లాన్ చేయాలని చూసింది. కానీ ఇప్పుడు మాత్రం నోయల్‌తోనే స్పెషల్ చిట్ చాట్ చేసింది.

అన్ని సీజన్లలో..
మొదటి సీజన్‌లో మధు ప్రియ, రెండో సీజన్‌లో దీప్తి సునయన, మూడో సీజన్‌లో శివజ్యోతి.. నాల్గో సీజన్‌లో మోనాల్‌లను వాటర్ ట్యాంక్‌లుగా వర్ణించిన మీమ్‌ను నోయల్‌కు లాస్య చూపించింది. కానీ అందులో దీప్తి సునయను మాత్రం వాటర్ ట్యాంకర్‌గా నోయల్ ఒప్పుకోలేదు. ఆమె చాలా బబ్లీగా ఉంటుంది.. మిగతా వారంతా ఓకే గానీ ఆమె మాత్రం కాదంటూ నోయల్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











