కొందరి మధ్య ఎప్పటికీ ఎడబాటు రాదు.. నోయల్ ఎమోషనల్ పోస్ట్
బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నాల్గో సీజన్ గడిచిపోయి నెల దాటినా కూడా కంటెస్టెంట్లు మాత్రం ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంటున్నారు. ప్రతీ వారం ఏదో ఒక ఈవెంట్, ఏదో ఒక స్పెషల్ షోలో కనిపిస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ షో గడిచాక కొన్ని రోజులు సంక్రాంతి ఈవెంట్‌తో సందడి చేశారు. ఇప్పుడు కొత్త షోలతో బిగ్ బాస్ కంటెస్టెంట్లు హడావిడి చేస్తున్నారు.

బిగ్ బాస్ కంటెస్టెంట్లతో రచ్చ..
బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఎలాగైనా సరే పూర్తి స్థాయిలో వాడేందుకు స్టార్ మా బాగానే ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వారితో కొత్త షోలను ప్లాన్ చేసింది. ఈక్రమంలో స్టార్ట్ మ్యూజిక్, కామెడీ స్టార్స్ వంటి షోలను ప్రారంభించారు. అందులోనూ బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఎవరి గ్యాంగ్‌లకు సంబంధించిన వాళ్లనే పిలిచారు.

సుమతో అలా..
సుమ హోస్ట్‌గా ప్రారంభమైన స్టార్ట్ మ్యూజిక్ షోలో లాస్య, హారిక, నోయల్ ఒక టీంగా పాల్గొన్నారు. ఇక సోహెల్, మెహబూబ్, అఖిల్ మరో టీంమేట్స్‌గా వచ్చారు. అలా మొత్తానికి ఎవరి గ్యాంగ్‌లను వారితో కంబైన్ చేసి ఆటలు ఆడించింది. ఈ ఎపిసోడ్ బాగానే క్లిక్ అయింది.

నోభికస్య గ్రూప్..
బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో నోభికస్య గ్రూపుకు ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. నోయల్, అభిజిత్, హారిక, లాస్యల కాంబోను అందరూ ఇష్టపడుతుంటారు. బిగ్ బాస్ షో ముగిశాక.. ఈ నలుగురు కలిసి ఎక్కడా కూడా కనిపించలేదు. ఈ నలుగురు కలిసి ఓ ఇంటర్వ్యూను ప్లాన్ చేయండని అందరూ కోరుకుంటున్నారు.

అలా కలిశారు..
నోభికస్య కలవాలని, కలిస్తే ఓ సారి చూడాలని ఎంతో మంది అనుకుంటున్నారు. బిగ్ బాస్ ఉత్సవం పేరిట జరుగుతున్న కార్యక్రమంలో బిగ్ బాస్ నాలుగు సీజన్ల కంటెస్టెంట్లు పాల్గొన్నారు. అందులో భాగంగా ఈ నలుగురు కలిసి రచ్చ చేశారు. తన ఫ్రెండ్స్‌తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ నోయల్ ఎమోషనల్ అయ్యాడు.
Recommended Video

ఎప్పటికీ చెరిగిపోవు..
కొంత మంది మనుషులు మధ్య బంధాలు ఎప్పటికీ చెరిగిపోవు.. వారి మధ్య ఎడబాటు రాదు.. ఏది ఏమైనా కూడా మళ్లీ కలిసిపోయేందుకు ఓ దారిని వెతుక్కుంటారు.. అయితే ఆ నిర్ణయాన్ని కాలానికే వదిలేయాలి.. ఎప్పుడో సారి అన్నీ సమస్యలు సమసిపోతాయని నోయల్ చెప్పుకొచ్చాడు


Click it and Unblock the Notifications











