దాని విలువ కాపాడేందుకే ఇలా.. ఆమె కన్న కలలు నిజం కావాలి.. విడాకులపై నోయల్ పోస్ట్ వైరల్
సినిమా ప్రపంచంలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు ఎంతో కామన్ అన్న సంగతి తెలిసిందే. హీరో హీరోయిన్లు సింగర్లు ఇలా ప్రతీ ఒక్క సెలెబ్రిటీ పర్సనల్ లైఫ్‌లో ఏదో ఒక విషాదం ఉండనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి విషయాల్లో సెలెబ్రిటీలు నవ్వులపాలు అవుతుంటారు. ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు మళ్లీ ఇట్టే విడిపోతారు. తాజాగా ఈ కేటగిరీలోకి సింగర్, ర్యాపర్ నోయల్ కూడా చేరాడు.
Recommended Video

ఘనంగా వివాహం..
గతేడాది జనవరిలో హీరోయిన్ ఎస్తర్‌ను వివాహం చేసుకున్నాడు నోయల్. ఇద్దరూ ఘాడంగా ప్రేమించుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పట్లో ఈ జంట పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేశాయి కూడా. ఈ వేడుకకు టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. అయితే తాజాగా నోయెల్ విడాకుల విషయాన్ని ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేశాడు.

కోర్టు ప్రకటించాలి..
‘నాకు అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి. ఎన్నో రోజుల మౌనం వీడి ఈస్తర్‌తోకు నాకు విడాకులు అయ్యాయని ప్రకటిస్తున్నాను.ఇక ఈ విషయాన్ని కోర్టు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దాని కోసమే నేను ఎదురుచూస్తున్నాను. అభిప్రాయ బేధాలు ఏర్పడటంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.

విలువ కాపాడేందుకు..
ఈ అందమైన బంధం విలువను కాపాడేందుకు మేము ఇలా విడిపోయాం. ఈస్తర్‌కు మంచి జరగాలి.. ఆమె కన్న కలలన్నీ నిజం కావాలి. నీకు అంతా మంచే జరగాలి.. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయానికి మద్దతుగా ఉండాలని, మేము దీన్ని నంచి పూర్తిగా కోలుకునేలా సహకరించాలని కోరుకుంటున్నాను.

దేవుడు మంచి వాడు..
ఇది ఎప్పటికి నా జీవితంలో ఓ గొప్ప దశ. నాతో పాటు ఉన్న ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఆమెను గానీ, నా కుటుంబాన్ని గానీ ఎవ్వరూ బాధపెట్టవద్దని కోరుతున్నాను. నా కష్టకాలంలో నా వెంటే నిలిచిన నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కు థ్యాంక్స్. ఆ దేవుడు ఎప్పుడూ మంచివాడే.. ఇదో గొప్ప ప్రారంభం అని నేను నమ్ముతున్నాను' అంటూ నోయెల్ విడాకుల విషయాన్ని ప్రకటించాడు.


Click it and Unblock the Notifications











