చండీఘర్ న్యాయస్ధానం నిన్న(బుధవారం) బాలీవుడ్ హీరో సునీల్ శెట్టికి నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది. చెక్కు బౌన్స్ అయిన కేసులో కోర్టు ఆదేశించినప్పటికీ హాజరుకాకపోవడమే దీనికి కారణం. చెన్నైకి చెందిన హెచ్‌ఐటీఎల్ సంస్థ నగరంలోని దుకాణదారుడు సుభాశ్ గులాటీకి ఇచ్చిన 10 లక్షల చెక్కు బౌన్స్ అవటంతో ఈ పరిణామం ఎదుర్కొవాల్సి వచ్చింది. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మనీషా జైన్ ఈ వారెంట్ ని ఇష్యూ చేసారు. ఇక ఈ సంస్థకు చెందిన మొబైల్ హేండ్‌సెట్‌ల ఆవిష్కరణ కార్యక్రమానికి సునీల్ శెట్టి కూడా హాజరయ్యారని, ఆ తర్వాతే తాను ఆ ఫోన్ల పంపిణీకి ఒప్పందం చేసుకున్నానని గులాటీ తెలిపారు.