twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎస్.ఎస్.రాజమౌళి పై బ్యాన్

    By Staff
    |

    ప్రముఖ దర్శకుడు రాజమౌళిపై ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా బ్యాన్ విధించిందని సమాచారం. ఈ బ్యాన్ ని అనుసరించి సిని పరిశ్రమలోని అన్ని విభాగాలను రాజమౌళికి సహకరించకూడదని కోరినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం నిర్మాత అడ్డాల చంటి ఇచ్చిన కంప్లైంట్ తో తీసుకున్నారు. అడ్డాల చంటి సెప్టెంబర్ 2002 లో రాజమౌళికి సినిమా చేయమని ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారు. అయితే రాజమౌళి ఆ సినిమా చేయలేదు.దాంతో చంటి తన మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించమన్నారు. దానికి రాజమౌళి ఒప్పుకోకపోవటంతో వివాదం మొదలైందని తెలుస్తోంది. అయితే వాదన విన్న నిర్మాతల మండలి వెంటనే రాజమౌళిని 36 పర్శంట్ వడ్డీతో పాతికలక్షల మొత్తాన్ని చెల్లించమని ఆదేశించింది. దానికి స్పందించకపోవటంతో ఈ నిర్ణయం నిర్మాతల మండలి తీసుకుని రాజమౌళిపై నిషేధం పెట్టినట్లు సమాచారం.

    అయితే నిన్న(ఆదివారం)రాజమౌళి డైరక్టర్స్ అశోషియేషన్ లో ఈ విషయాన్ని ప్రస్ధావించారని తెలుస్తోంది. అంత వడ్డీవేసి ఆ మొత్తం కట్టమనటం అన్యాయమని దర్శకుల మండలి లో అందరూ ఆయనకు సపోర్టు చేసారని వినికిడి. అప్పట్లో అడ్వాన్స్ తీసుకున్న రాజమౌళి అందరి హీరోల దగ్గరకూ డేట్స్ కోసం వెళ్లారని రకరకాల కారణాలతో వారెవరూ డేట్స్ ఇవ్వకపోవటంతో సినిమా ప్రారంభించలేకపోయామని రాజమౌళి వాదన అని పిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అలాగే తమిళ రైటర్స్ తెచ్చిన కథ సైతం కొందరకి వినిపించామని, మహేష్ బాబు తో సహా అందరూ హీరోలను టచ్ చేసారమి ఎవరూ అడ్డాల చంటితో ఆ ప్రాజెక్టు చేయటానికి ముందుకు రాకపోవటంతో దాన్ని ఆపవలసివచ్చిందని సహేతుక కారణాలతో వివరించారని తెలుస్తోంది. ఇక ఈ విషయమై దర్శకుల మండలి సైతం ఓ నిర్ణయాన్ని తీసుకుని రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజమౌళి డైరక్ట్ చేసిన మగధీర రిలీజుకు రెడీగా ఉంది. అలాగే ఆయన సునీల్ హీరోగా మర్యాద రామన్న అనే చిత్రం రూపొందిస్తున్నారు. అలాగే రాజమౌళికి తెలుగు హీరోల్లో చాలామంది సంఘీభావం ప్రకటించే అవకాశం ఉంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X