twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మానందానికి నాన్ స్టాప్ టార్చర్

    By Bojja Kumar
    |

    టాలీవుడ్ టాప్ కామెడీ స్టార్ బ్రహ్మానందానికి నెట్ ఆకతాయిల నుంచి నాన్ స్టాప్ గా టార్చర్ తప్పడం లేదు. తొలుత కేవలం టాలీవుడ్ హీరోలను ఫోటోలను బ్రహ్మీ ముఖంతో మార్ఫింగ్ చేసి...సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వదిలేవారు. తెలుగు యువహీరోల సినిమా టైటిళ్లకు పేరడీ పేర్లు తగిలించి దానికి బ్రహ్మీ మార్ఫింగ్ ఫోటోలు పెట్టే వారు. ఇలా బ్రద్రీనాథ్ బ్రహ్మీనాథ్ గా, దూకుడు పాకుడుగాను నెట్ లో దర్శనం ఇచ్చాయి. ఆ తర్వాత రాజకీయ నాయకుల ఫోటోలకు బ్రహ్మీ మార్ఫింగ్ ఫోటోలు తగిలించారు. అలా వచ్చినవే బరాక్ బ్రహ్మి, కొణిజేటి బ్రహ్మయ్య ఫోటోలు.

    ఇదీ కాక అన్నా హజారే ఫోటోకు బ్రహ్మీ ఫోటో తగిలించి బ్రహ్మీ బజారే అంటూ వెక్కించారు. తాజాగా క్రీడా కారులను కూడా ఆకతాయిలు వదలడం లేదు. తాజాగా శ్రీలంక బౌలర్ మలింగ ఫోటోను బ్రహ్మీ ఫేసుతో మార్ఫింగ్ చేసి...బ్రలింగ అనే టైటిల్ తగిలించారు. ఇలా రోజుకో ఫోటోతో బ్రహ్మానందం ఫేసును మార్ఫింగ్ చేసి హడావుడి చేస్తున్నారు. మరి దీనిపై బహ్మీ ఎలా ఫీలవుతున్నాడు అనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఇలా జరుగడం వల్ల తన కామెడీ ఫేసుకు మరింత ప్రచారం జరుగుతుందని సంబర పడుతున్నాడో? లేక తన పరువు పోతోందని బాధ పడుతున్నాడో? తెలియదు కానీ, వీటిని చూసిన బ్రహ్మీ అభిమానులు మరింత నవ్వు కుంటున్నారు.

    English summary
    Comedian Brahmanandam is currently facing a new form of torture. And this is not onscreen but off screen. Well, for some reason, Brahmi has become the hot cake for the morphing experts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X