నయనతారకు నాన్ స్టాప్ ప్రశంసలు..ఆ క్రెడిట్ బాలకృష్ణకే..1
బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో బాపు రూపొందించిన శ్రీరామ రాజ్యం చిత్రం రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అందరికన్నా సీతగా వేసిన నయనతారకే ఎక్కువ మార్కులు పడ్డాయి. గ్లామర్ పాత్రలు చేసిన నయనతార సీతగానా?అంటూ విమర్శించిన వాళ్లు సైతం 'శ్రీరామ రాజ్యం" చిత్రం చూసిన తర్వాత నయనతారను నాన్ స్టాప్ గా పొగుడుతున్నారు. మహా పతివ్రత సీతగా నయనతార అద్భుతంగా యాక్ట్ చేసిందని అంటున్నారు. ఇది నయనతార చివరి చిత్రం అని కొంత మంది ఫిక్స్ అయ్యి చివరిగా మంచి సినిమా చేసిందని ప్రశంసిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణకే ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుందన్నారు. ఆమె మాటల్లోనే... గతంలో మేమిద్దరం కలిసి సింహా సినిమాకి పనిచేసాం. శ్రీరామ రాజ్యం వంటి సినిమాలో చెయ్యటానకి ఆయనే కారణం. ఆయనే నేను సీత పాత్రకు న్యాయం చేయగలనని నమ్మి ఆ పాత్రను రికమెండ్ చేయటం జరిగింది. నిజానికి నన్ను సీత పాత్రకు ఎంపిక చేసినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. అయినా బాపు సాయిబాబు, బాలకృష్ణ గార్లు పట్టించుకోకుండా ఈ అవకాశం ఇచ్చారు. వారి నమ్మకాన్ని నిలబెట్టాను. ఈ రోజు నా గురించి అందరూ పాజిటివ్ రివ్యూలు రాస్తుంటే, ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో రాముడిగా బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఆ పాత్రలో ఆయన్ను తప్ప వేరే నటుడ్ని ఊహించుకోలేక పోతున్నాను అంత బాగా చేశారు అంటున్నారు నయనతార.
బాపుగారు నాకు తండ్రిలాంటివారు ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం నాలక్. శ్రీ రామ రాజ్యం" ని ఓ అద్భుతమైన పెయింటింగ్ లా తీశారాయన. ఎక్కడా రీటేక్స్ లేకుండా చేశాం. నిర్మాత యలమంచిలి సాయిబాబుగారు మంచి వ్యక్తి ఆయన లేకపోతే శ్రీరామ రాజ్యం"లేదు. కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి రిస్కీ ప్రాజెక్ట్ చేయాలని ఏ నిర్మాత అనుకోరన్నారు. ఈ చిత్రంలో నన్ను నేను చూసుకుని చాలా ఆనందపడ్డాను. కెమెరా మ్యాన్ రాజుగారు అందర్నీ ఎంతో అందంగా చూపించారు. ఈ చిత్రం నాకో మంచి తీపి గుర్తు.


Click it and Unblock the Notifications











