Don't Miss!
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
షాపు ఓపెనింగ్‌కు వెళ్లిన హీరోయిన్.. ముక్కు మీద గుద్దిన అభిమాని.. స్టేజ్‌పైనే కన్నీరు
ఈ మధ్య హీరోయిన్లు షాప్ ఓపెనింగ్‌ల పేరిట బాగానే సంపాదించుకుంటున్నారు. అక్కడి వరకు బాగానే ఉన్నా.. పబ్లిక్‌లోకి వచ్చిన హీరోయిన్లకు చేదు అనుభవాలు జరుగుతూ ఉంటాయి. హీరోయిన్లు ఎక్కడైనా కనబడితే అభిమానులు ఊరికే కూర్చుంటారా? ఎగబడి పరిగెత్తరూ. తాము ఆరాధించే దేవతల్లా చూసుకునే హీరోయిన్లు వస్తున్నారంటే అక్కడే సందడి వాతావరణం నెలకొంటుంది. స్టార్ హీరోయిన్స్ నుండి చిన్న హీరోయిన్స్ వరకు ఏదో ఒక సమయంలో చాలా మందికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇటీవల మలయాళి ముద్దుగుమ్మ నూరిన్ షెరీఫ్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. దాంతో స్టేజ్ పైనే నూరిన్ కన్నీరు పెట్టుకుంది.
ఒరు అదార్ లవ్‌తో ఫేమస్ అయిన నూరీన్..
మళయాల మూవీ ఒరు అదార్ లవ్ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఒక్క కన్ను గీటుతో దేశాన్ని ఊపేసిన ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒరు అదార్ లవ్‌ను తెలుగులో లవర్స్ డేగా రిలీజ్ చేశారు. అయితే టీజర్ ఆకట్టుకున్నంతగా సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం విడుదలైన తరువాత ప్రియా ప్రకాష్ క్రేజ్ పడిపోయి.. మరో హీరోయిన్ నూరీన్ షరీఫ్‌కు ఫాలోయింగ్ పెరిగింది.
తాజాగా షాప్ ఓపెనింగ్..
మంజేరిలోని ఒక సూపర్ మార్కెట్ ఓపెనింగ్ కు నిర్వాహకులు నూరిన్ గెస్ట్‌గా వెళ్లింది. సాయంత్రం 4 గంటల సమయంలో సూపర్ మార్కెట్ ఓపెనింగ్ అంటూ చెప్పడంతో జనాలు మద్యాహ్నం మూడు గంటల నుండే అక్కడ పోగయ్యారు. నూరిన్ కూడా హోటల్ కు మూడున్నర వరకు చేరిందట. అయితే సూపర్ మార్కెట్ యాజమాన్యం జనాలు ఇంకా ఎక్కువ రావాలనే ఉద్దేశ్యంతో కార్యక్రమంను వాయిదా వేస్తూ ఆలస్యం చేసుకుంటూ వచ్చారు.
ఒక్కసారిగా మీద పడిన జనాలు..
చివరకు సాయంత్రం ఆరు గంటల సమయంలో నూరిన్ అక్కడకు చేరుకుంది. ఎందుకింత ఆలస్యం అయ్యిందంటూ ఇంత సమయం వెయిట్ చేశామంటూ కారుపై గట్టిగా కొట్టడంతో పాటు ఆమెకు అడ్డు పడ్డారు. కారులోంచి నూరిన్ దిగిన సమయంలో కూడా చాలా మంది అభిమానులు ఆమెను చుట్టుముట్టారు.
ముక్కుకు తగలడంతో స్టేజ్‌పై కన్నీరు..
అభిమానుల తాకిడిలో ఆమె ముక్కుకు ఓ వ్యక్తి చేయి బలంగా తలిగింది. దీంతో ఆమెకు ముక్కుకు చిన్న గాయం కావడంతో స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకుంది. అయితే అందరూ ఓదారుస్తుండగా.. ఓ రెండు నిమిషాల తరువాత సాధారణ స్థితికి చేరుకుంది.
యాజమాన్యం వల్లే లేట్..
ఆ తర్వాత ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడింది. ఆలస్యంకు కారణం తాను కాదని.. తాను వచ్చి వెయిట్ చేస్తున్నాను అని యాజమాన్యం ఆలస్యం చేయడం వల్లే తాను లేట్‌గా వచ్చానంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి షాప్ఓపెనింగ్ అంటూ వచ్చిన నూరీన్కు చేదు అనుభవమే జరిగిందని చెప్పుకోవాలి. యాజమాన్యం చేసిన పొరపాటు వల్ల నూరీన్ కంట నీరు పెట్టాల్సి వచ్చింది.