»   » 'బాహుబలి' :సెట్స్ పై ఆమె జారిపడి....బట్టలు తొలిగాయి

'బాహుబలి' :సెట్స్ పై ఆమె జారిపడి....బట్టలు తొలిగాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఏదో ఒక సందర్బంలో మీరు వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ గురించి వినే ఉంటారు. వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ అనేది యాక్సిడెంటల్ గా శరీరంయొక్క ప్రైవేట్ పార్ట్స్ బహిర్గతమవటమే. వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ అనేది తరచూ సెలబ్రెటీల విషయంలో ఎక్కువగా పాపులర్ అయ్యింది. వారు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్త తీసుకొన్న, అకస్మాత్తుగా స్కిన్ షో కనబడితే చాలు కెమెరాలకు పని పెట్టేసి, క్లిక్ మనిపించేస్తుంటారు ఫోటోగ్రాఫర్లు. అటువంటి సమస్యే...బాహుబలి సెట్స్ పై ఐటం గర్ల్ నోరా ఫతేహా కు ఏర్పడింది. ఈ విషయమై ఆమె ముంబై మీడియాతో మాట్లాడింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


'బాహుబలి' చిత్రం కోసం ఆమెపై స్పెషల్ సాంగ్ చేసారు. ఆ సాంగ్ లో ఊహించని విధంగా ఇబ్బంది ఎదురైంది. ఆమె జారిపడింది. యూనిట్ అందరి ఎదురుగా పడటంతో ఆమెకు సిగ్గు పోయినంత పనైంది. ఆమె టాప్...కెమెరా ముందు పైకి లేచిపోయింది. అయితే అదే మయంలో తమన్నా వచ్చి...ఆమెను ఆ సిట్యువేషన్ నుంచి రక్షించింది.


Nora Fatehi suffers a wardrobe malfunction on 'Baahubali' set

ఈ విషయాన్ని ఈ మెరాకో ఐటం గర్ల్ బాలీవుడ్ మీడియాతో ఖరారు చేసి చెప్పింది. ఆమె మాట్లాడుతూ..అది ఓ భయంగొలిపే అనుభవం. తమన్నా కు ధాంక్స్ చెప్పుకుంటున్నాను...ఆ సమయంలో నన్ను సేవ్ చేసినందుకు అన్నారామె.


దాదాపు రూ: 200కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందిన 'బాహుబలి' గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం సెన్సార్ పనులను పూర్తిచేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ని అందుకుంది. దీంతో సినిమాకు సంబందించిన కార్యక్రమాలు దాదాపు పూర్తిచేసుకున్న చిత్ర బృందం జులై 10న భారీ విడుదలకు సిద్ధమవుతుంది.


ప్రచార చిత్రాల్ని చూసి అందులోని సాంకేతికత గురించి హాలీవుడ్‌ సైతం చర్చించుకొంటోంది . తెలుగు,తమిళ, హిందీ,మళయాళ భాషల్లో విడుదల చేయటానికి రెడీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచ ప్రేక్షకుల కోసం ఈ చిత్రంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ టీమ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


Nora Fatehi suffers a wardrobe malfunction on 'Baahubali' set

చిత్రం గురించి రాజమౌళి మాట్లాడుతూ.... ''ప్రభాస్‌తో 'బాహుబలి' చేయాలని ఆరేళ్ల క్రితమే నిర్ణయించుకొన్నా. నా సినిమాల్లో ప్రతినాయకులకు చాలా ప్రాధాన్యముంటుంది. తను ఎంత బలంగా ఉంటే... కథానాయకుడి పాత్ర అంత బలంగా ఎలివేట్‌ అవుతుంది. అందుకే ప్రభాస్‌కంటే ఎత్తు, ప్రభాస్‌ కంటే బలంగా ఉన్న నటుడు కావాలనుకొన్నా. ఆ సమయంలో నాకు రానానే గుర్తొచ్చాడు. ఓసారి రానాని కలసి భళ్లాలదేవ పాత్ర గురించి చెప్పా. ఏం మాట్లాడకుండా వెళ్లిపోయాడు. మళ్లీ ఓ రోజు నా దగ్గరకు వచ్చి 'కథానాయకుడిగా నటిస్తున్నా, వేరే భాషల్లో సినిమాలు చేస్తున్నా.


ఇలాంటి సమయంలో ప్రతినాయకుడిగా కనిపించడం సరైనదేనా? మీరే సలహా ఇవ్వండి' అని నన్నే అడిగాడు. 'నేనేం చెప్పానో, నీ పాత్రని ఎలా తీర్చిదిద్దుతాను అన్నానో... అలానే తీస్తా.. నువ్వే నిర్ణయం తీసుకో..' అన్నాను. రెండుమూడు గంటలు ఆలోచించుకొని 'నేను భళ్లాలదేవాగా నటించడానికి సిద్ధమే' అన్నాడు. పైకి అలా కనిపిస్తాడుగానీ మనిషి చాలా సున్నితం. ఈ సినిమా ముగిశాక మా అందరికీ ఓ ఉత్తరం రాశాడు. ఈ టీమ్‌తో తనకున్న అనుబంధం పంచుకొన్నాడు. ఆ లెటర్‌ చూశాక మాకు కన్నీళ్లు ఆగలేదు. తనలో మంచి రచయిత ఉన్నాడనిపించింది. అందుకే 'బాహుబలి2'కి రచయితగా పనిచేయమని చెప్పా.


ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వం వహించారు.శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. కీరవాణి సంగీతం అందించారు.

English summary
Nora Fatehi, who will be seen in an item number in SS Rajamouli's magnum opus 'Baahubali', had an embarrassing moment on the shoot set as her top slipped down in front of the entire crew.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu