twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్-పూరి బ్యూటీకి ‘సెక్స్ ఆన్ బీచ్’ కావాలంట!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘టెంపర్' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయడం ద్వారా టాలీవుడ్‍‌కి పరిచయం అవుతోంది మొరాకన్ మొరాకన్ చెందిన నారో ఫతేహి. బాలీవుడ్ చిత్రం ‘రోర్-టైగర్స్ ఆఫ్ ది సుందరబన్' ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్స్ రంగానికి పరిచయం అయింది.

    తాజాగా అమ్మడు ఓ విషయంలో హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఏదైనా పార్టీకి వెళ్లినపుడు ఏం ఫుచ్చుకుంటారు అంటే ‘సెక్స్ ఆన్ బీచ్' కావాలంటోంది. ఆమె నుండి వచ్చిన ఈ సమాధానం విని అంతా విస్తుపోతున్నారు. అయితే తర్వాత అసలు విషయం తెలుసుకుని తెగ నవ్వుకుంటున్నారు. ‘సెక్స్ ఆన్ బీచ్' అనేది ఓ కాక్‌టైల్ పేరు. వోడ్కా, మరికొన్ని పానీయాలు కలిపి కలిపి దీన్ని తయారు చేస్తారు. వీదేశాల్లో ఇది చాలా ఫేమస్.

    Norah Fatehi shocking all

    ‘టెంపర్' సినిమా విషయానికొస్తే....
    ‘టెంపర్' మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లో కాకుండా గుంటూరులో లేదా నిమ్మకూరులో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ ఇటీవల ఫిల్మ్ నగర్లో ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్తలను నిర్మాత బండ్ల గణేష్ ఖండించారు. ఈ వార్తలు ఎలా ప్రచారంలోకి వచ్చాయో అర్థం కాలేదన్నారు. హైదరాబాద్ లోనే ఆడియో వేడుక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. జనవరి 9న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

    కాగా...టెంపర్' చిత్రం అఫీషియల్ ఫస్ట్ లుక్ ఫోటోస్ విడుదలైనప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సిక్స్ ప్యాక్ బాడీతో ఎన్టీఆర్ గత సినిమాలకు భిన్నంగా కనిపిస్తున్నారు. పూరి జగన్నాథ్ తన సినిమాలో హీరోలను భిన్నంగా, తనదైన మార్కు కనిపించేలా స్టైలిష్‌గా చూపిస్తారు. తాజాగా ‘టెంపర్' చిత్రంలో తనదైన మార్కుతో జూ ఎన్టీఆర్‌ను ప్రజంట్ చేసాడు పూరి.

    తాజాగా విడుదలైన జూ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటోలు అభిమానులు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు.

    ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తూండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Tiger NTR is currently busy shooting for his upcoming film Temper under Puri Jagannath's direction. He is romancing cute Kajal in the film. But at the same time he is also dancing in a special song with beautiful and naughty model Norah Fatehi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X