రామ్ చరణ్ ని ఉద్దేశించి కాదు..బాలకృష్ణ వివరణ
మొత్తానికి రామ్ చరణ్, బాలకృష్ణ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. గత రెండు రోజులగా మీడియాలో జరుగుతున్న చర్చలకు తెరపడింది. బాలకృష్ణ ఈ విషయమై వివరణ ఇస్తూ మీడియాతో మాట్లాడి అపోహలను, వివాదాన్ని తొలిగింప చేసే ప్రయత్నం చేయటంతో ఇది సాధ్యం అయ్యింది. ఆయన తను చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు(గురువారం)వివరణ ఇచ్చారు. తెలుగు చిత్ర సీమను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా తాను సహించేది లేదని బాలకృష్ణ పేర్కొన్నారు. తాను ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసానో వారికి అవి బాగా తెలుసునని అన్నారు. అలాగే తెలుగు చిత్ర సీమలో మోహన్ బాబు, చిరంజీవిలతో సన్నిహితంగా తాను ఉంటానని అన్నారు.
ఇక శ్రీరామ రాజ్యం ఆడియో విడుదల సమయంలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఈ కాంట్రావర్శికి తెరలేపాయి. శ్రీరామ రాజ్యం ఆడియో విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. ఓ వ్యక్తి తెలుగు దర్సకులును చులకన చేస్తూ తమిళ దర్శకులను పొగిడినప్పుడు అలా మాట్లాడవద్దని అతనికి వార్నింగ్ ఇచ్చా.పళ్లు రాలతాయని హెచ్చరించా. చరిత్ర అతనికి తెలియదు. విత్తు మెలకెత్తి వృక్షమైతేనే కదా చరిత్ర తెలిసేది అని అన్నారు.అయితే అంతకుముందు రామ్ చరణ్.. సెవెంత్ సెన్స్ ప్రమోషన్ సందర్భంలో పాల్గొని తెలుగులో ఇలాంటి చిత్రాలు రాకపోవటానికి సరైన దర్శకులు లేరంటూ వ్యాఖ్యానించటంతో దీనికి ముడివేసి ఎలక్ట్రానిక్ మీడియా ఈ కాంట్రావర్శికి తెరలేపింది.


Click it and Unblock the Notifications











