»   » ఆ ముగ్గురినీ టెషన్ పెడుతున్న డాన్ శ్రియ..

ఆ ముగ్గురినీ టెషన్ పెడుతున్న డాన్ శ్రియ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాజల్, ఇలియానా, తాప్సీ ఈ ముగ్గురు హీరోయిన్లు ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ బిజీగా ఉన్నారు. చేతినిండా సినిమాలతో మరి కొంతకాలం వరకు ఊపిరి సలపనంత పనిలో ఉన్నారు. అయితే ఈ ముగ్గురినీ ఓ ముద్దుగుమ్మ టెన్షన్ పెడుతోంది. అది మరెవరో కాదు శ్రియ. ఆ మద్య బాలీవుడ్ కి వెళ్ళి తిరిగి టాలీవుడ్ కి వచ్చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్న 'డాన్ శీను"లో నటించింది.

తెలుగులో తన యథాస్థానం సాధించుకోవాలనే యోచనలో ఉన్న శ్రియ..మరి ఎంతగా ఎక్స్ ఫోజింగ్ చేసిందో డాన్ శీను చిత్రం పై ఇప్పటి వరకు వచ్చిన స్టిల్స్ చూస్తే అర్థం అవుతుంది. ఎంత పేరు తెచ్చుకోవాలని అనుకున్నా..మరి శ్రియ తన అందాలను అంతలా ఎక్స్ ఫోజ్ చేయాలా అనేంతగా తన అందాలన్నీ ఆరబోసిన శ్రియ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కొమరం పులి" లో కూడా ఓ ఐటమ్ సాంగ్ చేసేసింది. ఈ రెండు సినిమాలతో మళ్ళీ టాలీవుడ్ లో తన పట్టు సాధించాలని చూస్తోంది.

బాలీవుడ్ కి వెళ్ళినప్పటికీ ఇక్కడ ఆమె ఫాలోయింగ్ ఏమీ తగ్గలేదని తెలుస్తోంది. 'డాన్ శీను", 'కొమరం పులి" చిత్రాలు రిలీజ్ అయిన తర్వాత శ్రియ పొజిషన్ ఎలా వుంటుందోనని ఇలియానా, కాజల్, తాప్సీ తెగ టెన్షన్ పడిపోతున్నారట. పరిస్థితి ఎలా వుండబోతోందో తెలియాలంటే మరో నెలరోజులు ఆగాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu