నో పాలిటిక్స్ అని తేల్చి చెప్పిన సూపర్ స్టార్..
బతికినంతకాలం నటుడిగానే ఉంటానని, నటుడిగానే మరణిస్తానని, ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రానని బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ తేల్చేశాడు. నేను నేతల దగ్గరికి బయల్దేరగానే షారుఖ్ రాజకీయాల్లో వెళ్తున్నాడని అంటారు. వాళ్లే సినిమాల్లోకి వస్తారని ఎందుకు అనుకోకూడదు అంటూ చమత్కరించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఇటీవల ఎక్స్‌ప్రెస్ అడ్డా పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ షారుఖ్ అందరినీ ఇలా ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆమిర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌లపై టన్నులకొద్దీ అభిమానం కురిపించి మరొక్కసారి ఆశ్చర్యపరిచాడు.ఇద్దరూ తన సీనియర్లని చెప్పుకున్నాడు. తాను సినిమాల్లోకి రాక ముందే ఆమిర్, సల్మాన్‌లు పరిశ్రమలో ఉన్నారు. ఇప్పుడు అందరూ మా ముగ్గురి గురించే మాట్లాడుకుంటున్నారని షారుఖ్ చెప్పాడు.
షారుఖ్ హఠాత్తుగా ఈ ఇద్దరు ఖాన్‌లపై టన్నులకొద్దీ అభిమానం కురిపిం చాడు. వాళ్లిద్దరూ తన సీనియర్లని చెప్పుకున్నాడు. తమ ముగ్గురి మధ్య ఉన్న అనుబం ధం గురించి స్పంది స్తూ ఒకప్పుడు తాము ఎంతో సంతోషంగా గడిపామని, అందరం కలిసి లాం గ్‌డ్రైవ్‌లకు వెళ్లిన రోజులూ ఉన్నాయని తెలిపాడు. సల్మాన్ డ్యాన్స్ చాలా బాగుం టుందని, దబంగ్ సినిమా కూడా అద్భుతంగా ఉందని ఈ బాలీవుడ్ బాద్‌షా ప్రశంసించాడు. గత 24 ఏళ్లుగా బాలీవుడ్‌ను ఏలుతుండడం నిజంగా తనకు గర్వకారణమని షారుఖ్ వ్యా ఖ్యానించాడు. చిన్నప్పటి నుంచి పెద్ద నటుణ్ని కావాలని కలగనే వాడినని చెప్పుకొచ్చాడు. వచ్చే నెల రా.వన్ విడుదల కావడంపైనా షారుఖ్ స్పందించాడు. ఒత్తిళ్లు మనకు ప్రేరణగా నిలుస్తాయని చెబుతూ ఈ సినిమా విజయవంతం కోసం తీవ్రంగా శ్రమించామన్నాడు. తారల మధ్య సంబంధాలు చెడిపోతే విమర్శలు మినహా ఏమీ ఉండవని అందరూ అనుకుంటారు. ఇది నిజం కాదు అని చెప్పాడు.
అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ హీరో చిత్రం 'రా.వన్'లో షారుఖ్, కరీనా కపూర్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల కంటే భారీ వ్యయంతో సిద్ధమవుతున్న రా.వన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3డి ఫార్మాట్‌లో తమిళ్, తెలుగు, జర్మన్ భాషల్లో డబ్బింగ్‌తో విడుదలవుతుంది. ''నేను భారీ వ్యయంతో ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నా వెంట నిలిచిన పార్టనర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. వాళ్ళు డబ్బు పెట్టినందుకు కాదు, నా సినిమా మీద నమ్మకముంచినందుకు. ఆ సొమ్ము తిరిగి రావాలంటే గతంలో ఎన్నడూ జరగనంత బిజినెస్ జరగాలి'' అని తన కోరిక వెల్లబుచ్చాడు.


Click it and Unblock the Notifications











