టాలీవుడ్ నెం.1 స్థానంపై మహేష్ బాబు కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి సినిమాల నుంచి తప్పుకుని రాజకీయాల్లో చేరిన తర్వాత టాలీవుడ్ నెం.1 స్థానం ఎవరు దక్కించుకోబుతున్నారనే దానిపై తెలుగు సినీ పరిశ్రమలో, మీడియాలో గత కొన్ని నెలలుగా ఆసక్తికర చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ రేసులో ముఖ్యంగా మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య వరుస హిట్లు కొడుతున్న మహేష్ బాబే నెం.1 కాబోతున్నారనే వాదన కూడా ఎక్కువయింది.
ఈ వార్తలపై సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన శైలిలో స్పందించారు. తనకు కష్ట పడి పని చేయడం మాత్రమే తెలుసని, టాలీవుడ్ నెం.1 స్థానంపై ఇంట్రెస్ట్ లేదని తేల్చి చెప్పారు. అదే విధంగా హిందీ బిజినెస్ మేన్ లో నటించే ఉద్దేశ్యం లేదని, తెలుగులో ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయని స్పష్టం చేశారు. తన అభిమానులను అలరించడానికి తన సాధ్యమైనంత మేరకు కష్ట పడతానని మహేష్ బాబు తేల్చి చెప్పారు.
మహేస్ బాబు ఇటీవల నటించిన 'దూకుడు' సినిమాతో పాటు, సంక్రాంతికి విడుదలైన 'బిజినెస్ మేస్' సినిమా భారీ విజయం సాధించిన విసయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయన దిల్ రాజు బ్యానర్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే చిత్రంలో నటిస్తున్నారు. మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఇందులో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారు. ఇద్దరూ ఇందులో అన్నదమ్ములుగా కనిపించనున్నారు. మహేష్ బాబు సరసన సమంత నటిస్తుండగా, వెంకటేష్ సరసన అమలపాల్ పేరు వినిపిస్తోంది. జనవరి 18న విశాఖలో షూటింగ్ ప్రారంభం అయింది. తొలుత వెంకీపై షూటింగ్ ప్రారంభం అయింది. మరికొన్ని రోజుల్లో మహేష్ బాబు షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు.


Click it and Unblock the Notifications











