మెగా పాలిటిక్స్: భయంతో బండ్ల గణేష్ ట్వీట్!

ప్రస్తుతం బండ్ల గణేష్ రామ్ చరణ్ హీరోగా 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని తర్వాత కలెక్షన్లు బాగా రాబట్టగలిగే ఇతర మెగా హీరోలు, ఇతర స్టార్ హీరోలతో కూడా సినిమాలు తీసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ 'జన సేన' పార్టీ పెట్టడం బండ్ల గణేష్‌కు కొత్త తలనొప్పి తెచ్చింది.
పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడైన గణేష్ కూడా 'జన సేన' పార్టీకి మద్దతుగా ఉంటున్నాడనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇలాంటి వార్తలు నిర్మాతగా తన కెరీర్‌కు మంచిది కాదని భావించిన గణేష్.......ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. 'నాకు రాజకీయాలంటే తెలియదు. అదే విధంగా రాజకీయాలపై ఆసక్తి కూడా లేదు. ఐ లవ్ సినిమా...ఐ లైవ్ సినిమా' అంటూ ట్వీట్ చేసారు.
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్....మద్య రగులుతున్న రాజకీయాల్లో తాను బలికాకూడదనే భయంతోనే బండ్ల గణేష్ ఈ ట్వీట్ చేసినట్లు స్పష్టమవుతోంది. బండ్ల గణేష్ మాత్రమే కాదు చాలా మంది పరిశ్రమకు చెందిన వారు కూడా ఏ రాజకీయ పార్టీల వైపు చూడకుండా తటస్థంగా ఉంటున్నారు.


Click it and Unblock the Notifications











