twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోర్టు చిక్కుల్లో రాంగోపాల్ వర్మ ‘నాట్ ఎ లవ్ స్టోరీ’

    By Bojja Kumar
    |

    దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న 'నాట్ ఎ లవ్ స్టోరీ(ఇది ప్రేమకథ కాదు)" కోర్టు చిక్కుల్లో పడింది. ఆ సినిమాను వెంటనే నిలిపి వేయాలని కోరుతూ షరీఫ్ జుబేరి అనే నిర్మాత ముంబై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. తన కథను కాపీ కొట్టి వర్మ సినిమా తీశారని, తనకు న్యాయం చేయాలని జుబేరి కోర్టుకు విన్నవించారు.

    టీవీ ఎక్సిక్యూటివ్ నీరజ్ గ్రోవర్ హత్య కేసు ఆదారంగా తాను 'లవ్ ఎఫైర్" అనే సినిమాను రూపొందిస్తున్నానని, ఇందుకు సంబంధించిన స్క్రిప్టును తాను గతంలోనే ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ చేశానని జుబేరీ వెల్లడించారు. తన కథను కాపీ కొట్టి వర్మ సినిమా తీస్తున్నాడనే విషయం తెలిసి షాకయ్యానని పేర్కొన్నారు.

    తన 'లవ్ ఎఫైర్" సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయిందని, దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టానని, మరో నలభై ఐదు రోజుల్లో విడుదలకు సిద్దం చేస్తున్నానని తెలిపారు. వర్మ సినిమాను నిలిపి వేయకపోతే తాను తీవ్రంగా నష్టపోతానని తెలిపారు.

    జుబేరి పిటీషన్ నేపేథ్యంలో....ఆగస్టు 19న విడుదల కానున్న వర్మ 'నాట్ ఎ లవ్ స్టోరీ" విడుదలపై సందిగ్ధత నెలకొంది.

    English summary
    Producer Shareef Zuberi yesterday filed a suit in a City Civil Court of Mumbai, seeking a direction to restrain film maker Ram Gopal Verma from releasing his forthcoming film Not a Love Story.He alleged that Verma had copied the story idea and was making a similar film on Neeraj Grover's murder with the title "Not a love story".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X