రామ్ గోపాల్ వర్మ ‘నాట్ ఎ లవ్ స్టోరీ’కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న 'నాట్ ఎ లవ్ స్టోరీ(ఇది ప్రేమ కథ కాదు)" సినిమా విడుదలకు బాంబే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల 19న విడుదల కావాల్సిన సినిమాకు అడ్డంకులు తొలగినట్లయ్యాయి.
టివి ఎక్స్‌క్యూటివ్ నీరజ్ గ్రోవర్ హత్యోదంతం ఆధారంగా.....ఈ దారుణాకి పాల్పడ్డ కన్నడ నటి మరియా సుసైరాజ్, మరొక వ్యక్తి రాక్షస చర్యలను వర్మ తన క్రియేటివిటీకి పదును పెట్టి సినిమాగా తెరకెక్కించాడు. అయితే ఇలా సినిమా తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెంటనే సినిమా విడుదలను నిలిపి వేయాలని కొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే వారి అభ్యంతరాలను కొట్టి వేస్తూ....బాంబే హైకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది.


Click it and Unblock the Notifications











