twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సాహో’పై పాజిటివ్ కామెంట్సే కాదు... నెగెటివ్ టాక్ కూడా!

    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన 'సాహో' మూవీ గ్రాండ్ విడుదలైంది. ఇండియా కంటే ముందే యూఎస్ఏ, పలు ఓవర్సీస్ లొకేషన్లలో మూవీ విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం తెల్లవారు ఝామున షోలు పడ్డాయి. సినిమా చూసిన అనంతరం ఆడియన్స్, ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

    అయితే ఈ మూవీపై పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌తో పాటు నెగెటివ్ రెస్పాన్స్ కూడా వస్తోంది. డైహార్డ్ ఫ్యాన్స్ సినిమా బావుందని కామెంట్స్ చేస్తుండగా... కొందరు మాత్రం సినిమా బాగోలేదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.

    ప్రభాస్ సాహో ట్విట్టర్ రివ్యూ: డై హార్డ్ ఫ్యాన్స్ టాక్ ఏమిటంటే.. ఇంటర్వెల్.. క్లైమాక్స్ పీక్స్ప్రభాస్ సాహో ట్విట్టర్ రివ్యూ: డై హార్డ్ ఫ్యాన్స్ టాక్ ఏమిటంటే.. ఇంటర్వెల్.. క్లైమాక్స్ పీక్స్

    సినిమాపై వస్తున్న పాజిటివ్ కామెంట్స్ వివరాలతో కూడిన ఆర్టికల్ ఇప్పటికే పాఠకులకు అందించాం. మరి సినిమా బాగోలేదు అంటున్న వారు ఏ విషయాల్లో డిసప్పాయింట్ అయ్యారు? అనేది మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఓ లుక్కేయండి.

    సుజీత్ నుంచి ఇలాంటి మూవీ ఊహించలేదు

    సాహో స్క్రీన్ ప్లే చాలా వీక్‌గా ఉంది. కథ కూడా గొప్పగా ఏమీ లేదు. సుజీత్ నుంచి ఇలాంటి సినిమా ఊహించలేదు. హైప్ తప్ప సినిమాలో విషయం లేదు. ఫస్టాఫ్ బాగోలేదు, సెకండాఫ్ బావుంది. క్లైమాక్స్ ట్విస్ట్ బావుంది. దీనికి రూ. 350 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో అర్థం కావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

    350 కోట్లు ఎలా వేస్ట్ చేయొచ్చో చూపించిన మూవీ

    రూ. 350 కోట్లను ఎలా వేస్ట్ చేయవచ్చో ఈ సినిమా ద్వారా చూపించారు. దీన్ని రూ. 30 కోట్లలో తీసి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదంటూ మరకొందరు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

    ఈ మూవీ కంటే వార్ ట్రైలర్ బెటర్

    ‘సాహో' మూవీ కంటే ఇటీవల విడుదలైన ‘వార్' మూవీ ట్రైలర్ బావుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. ఇంటర్వెల్ తర్వాత చాలా మంది తాము రియల్ యాక్షన్ మూవీ చూస్తున్నామా; వీడియో గేమ్ చూస్తున్నామా? అనే ఆలోచనలో పడ్డారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

    ఇంటర్వెల్ ఎపిసోడ్ తప్ప...

    ఫస్టాఫ్ బాగోలేదు. ఇంటర్వెల్ ఎపిసోడ్ తప్ప మిగతా అంతా కూడా చెత్తగా ఉంది. అలా అని ఇంటర్వెల్ ఎపిసోడ్ బావుందని కాదు, స్క్రాప్ కంటే పర్లేదు అనే విధంగా ఉందని అర్థం. సుజీత్ తన లైఫ్ టైమ్ ఆపర్చునిటీ వేస్ట్ చేసుకున్నాడు. రూ. 350 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో అర్థం కావడం లేదు.

    English summary
    Not only positive talk, but It's also a negative talk on Saaho. Saaho written and directed by Sujeeth. It is produced by Vamsi Krishna Reddy, Pramod Uppalapati and Bhushan Kumar under their respective banners of UV Creations and T-Series. The film stars Prabhas and Shraddha Kapoor, and has been shot simultaneously in Hindi, Tamil and Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X