రవితేజను పక్కకు పెట్టి సునీల్ ని ఫామ్ లో తెచ్చిన డైరెక్టర్...!?
మిరపకాయ్ దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించబోతున్న చిత్రం 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'. ఈ చిత్రం లో సుబ్రహ్మణ్యం పాత్రలో సునీల్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ పేజ్ లో స్వయంగా దర్శకుడే తెలియజేయటం విశేషం. పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్' సినిమా పూర్తైన తరవాత ఈ సినిమా సెట్స్ ఫై కి వెళ్తుందని సమాచారం.
గతంలో రవి తేజ సుబ్రహ్మణ్యం పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినపడ్డాయి. కానీ ఇప్పుడు సునీల్ పేరును దర్శకుడు బయట పెట్టాడు. అలా అని రవితేజ ఈ సినిమాలో నటిస్తున్నాడా... లేదా అన్న విషయాన్నీ మాత్రం దృవీకరించలేదు. ఫైగా గబ్బర్ సింగ్ తరవాత మాస్ రాజా తో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తన డ్రీం ప్రాజెక్ట్ ఉంటుందని హరీష్ శంకర్ పేర్కొన్నాడు. దీనిని బట్టి 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ' అనే సినిమా హరీష్ శంకర్ డ్రీం ప్రోజక్ట్ అవునో కాదో స్పష్టత రావలసివుంది.


Click it and Unblock the Notifications











