Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
పవన్ కల్యాణ్ మూవీ నుంచి సాయిపల్లవి అవుట్.. మరో టాలెంటెడ్ హీరోయిన్‌కు బంపర్ ఆఫర్!
మలయాళ భాషలో అత్యంత ప్రేక్షకదారణను కూడగట్టుకొన్న అయప్పనుమ్ కోషియం సినిమాను తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్దికాలంగా హీరోయిన్ ఎంపికపై మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ చిత్రంలో పవన్ సరసన సాయిపల్లవి నటించడం లేదనే విషయం బయటకు వచ్చింది. అయితే పవన్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరంటే?
క్లీవేజ్ షోతో కాకపుట్టిస్తోంది.. హన్సమాలి పిక్స్ వైరల్

రానాకు జోడిగా ఐశ్వర్య రాజేష్
అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్‌కు సంబంధించిన షూటింగు హైదరాబాద్‌లో నిరవధికంగా కొనసాగింది. దాదాపు సగానికిపైగా సీన్ల చిత్రీకరణ పూర్తయ్యాయి. అయితే ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు జంటగా సాయి పల్లవి, రానాకు జోడిగా ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నారనే మాట వినిపించింది. అయితే ఆ వార్తకు భిన్నంగా సాయిపల్లవి నటించడం లేదనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

డేట్స్ సమస్యతో తప్పుకొన్న సాయిపల్లవి
అయ్యప్పనుమ్ కోషియం చిత్రంలో సాయిపల్లవి నటించడం లేదు. డేట్స్ సమస్య కారణంగా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకొన్నారు. ప్రస్తుతం సాయిపల్లవి స్థానంలో నిత్యామీనన్ దాదాపు ఖరారు చేశారు. త్వరలోనే అధికారికంగా ఆమె పేరును ప్రకటిస్తారనే విషయాన్ని సినీ వర్గాలు ధృవీకరించాయి.

పవన్ కల్యాణ్ సరసన నిత్య మీనన్
పవన్, రానా నటిస్తున్న ఇంకా పేరు పెట్టని సినిమాలోని కొన్ని ఎమోషనల్ సీన్లు, ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో నిత్యమీనన్ అయితే బాగుంటుందనే నిర్ణయానికి చిత్ర యూనిట్ వచ్చారు. పవన్ కల్యాణ్‌కు నిత్య మీనన్ పేరును హీరోయిన్‌గా సజెస్ట్ చేయడంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించారు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు అప్పట్లో ఒకడుండేవాడు ఫేం సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.