'గబ్బర్‌సింగ్ -2' పై అది కేవలం రూమరే
హైదరాబాద్: 'రచ్చ' దర్శకుడు సంపత్ నందితో నెక్ట్స్ పవన్ కళ్యాణ్ చేయబోతున్న చిత్రం 'గబ్బర్‌సింగ్ 2'. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తాజాగా పవన్ సరసన హిందీ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటించబోతోందని ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం మొదలైంది.
అయితే తమ చిత్రంలో ఆమె హీరోయిన్ కాదని చిత్ర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అది కేవలం రూమర్ అని కొట్టిపారేస్తున్నారు. ఇంకా పవన్‌తో ఆడిపాడే భామ ఎవరన్నది ఎంపిక కాలేదంటున్నారు.
'నాక్కొంచెం తిక్కుంది...' అంటూ గబ్బర్ సింగ్‌గా పవన్ కల్యాణ్ చేసిన సందడి ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. ఇప్పుడు 'గబ్బర్ సింగ్'కి రెండో భాగం రూపుదిద్దుకోబోతోంది. పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తారు.
అలాగే మరో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే - జూన్ మాసంలోనే 'గబ్బర్ సింగ్ 2' సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్నారు. ఆ వెంటనే ఆ ఇద్దరి కాంబినేషన్‌లోనే 'కోబలి' ఉంటుందనుకున్నారు. అంతకంటే ముందే 'గబ్బర్‌సింగ్ 2' ప్రారరభమవుతుంది. ఆ తరవాతే 'కోబలి'కి రంగం సిద్ధమవుతుంది.


Click it and Unblock the Notifications












