శ్రీశాంత్ ఎఫెక్ట్ : వ్యాపారితో ఎఫైర్ ఉందన్న లక్ష్మీరాయ్
శ్రీశాంత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న వారిలో చాలా మందికి ఐపీఎల్ అక్రమ వ్యవహారంలో ప్రమేయం ఉందని తేలడంతో పోలీసులు అందరినీ వలవేసి కలుగులోంచి బయటకు లాగుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు మీడియా శ్రీశాంత్‌కు, లక్ష్మీరాయ్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఎఫైర్ కూడా ఉందనే కొన్ని ఫోటో ఆధారాలు సంపాదించి, ఫిక్సింగులో ఆమె పాత్ర ఏమైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన లక్ష్మీరాయ్.....తమిళ మీడియా ప్రదర్శిస్తున్న అత్యుత్సాహంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీశాంత్ తనకు చాలా కాలంగా టచ్‌లో లేడని, అతనితో తనకు ఎలాంటి ఎఫైర్ లేదని, ఐపీఎల్ ఫిక్చింగ్ రొచ్చులోకి తనను లాగొద్దని వేడుకుంది. శ్రీశాంత్‌తో తనకు ఎలాంటి ఎపైర్ లేదని, ప్రస్తుతం తాను ప్రస్తుతం ఒక గుడ్ బిజినెస్ మేన్‌తో డేటింగ్ చేస్తున్న బయట పెట్టింది లక్ష్మీరాయ్.
ఐపీఎల్ 1 సందర్భంగా నయనతార, లక్ష్మీరాయ్ బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించారు. ఆ తర్వాత తాను ఐఫీఎల్ ఈవెంట్స్‌కు దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేసింది నయనతార. అదే విధంగా ధోని, అతని భార్య సాక్షితో కూడా టచ్‌లో లేనని వివరణ ఇచ్చుకుంది.


Click it and Unblock the Notifications












