పరిటాల హత్యా ప్రయత్నం చూసే ఐడియా .. కృష్ణవంశి
తర్వాత కొద్ది రోజులకే పరిటాలరవి మీద హత్యాయత్నం జరిగింది. ఠక్ మని ఆలోచన వచ్చింది. ఆ సినిమాని రాయలసీమ ముఠాకక్షల నేపధ్యంలో చేస్తే బాగుంటుందని కదాని...అంటూ కృష్ణవంశీ అంతపురం చిత్రం నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.
అనగనగా ఒక రోజు చిత్రం నుంచి నన్ను తప్పించాక చాలా బాధగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంతలో తమ్మారెడ్డి భరద్వాజగారి కారొచ్చి నా ప్రక్కన ఆగింది. ఏరా ఎక్కడికెళ్తున్నావు అని అడిగారాయన. ఇక్కడికే అన్నయ్యా అంటే రా..కారెక్కు అనినన్ను కారెక్కించుకుని తన ఆఫీసుకు తీసుకెళ్ళి సినిమా తీస్తావా అని అడిగారు. నన్ను తీసేసారన్నయ్యా అంటూ అంతకుముందు జరిగిందంటూ చెప్పాను. నాకు అంతా తెలుసులేరా, నువ్వు ఇంకో సినిమా తియ్యి అని ధైర్యం చెప్పారు. ఆ సంఘటన నాకు కొండంత ఆత్మ విశ్వాసాన్నిచ్చింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవటానికి ఒకరంటూ వచ్చారు.నేను అయిపోలేదు అనే ధైర్యాన్నిచ్చింది. ఆయనకోసం తీసిన సినిమానే అంతపురం.
నాట్ వితౌట్ మై డాటర్ ..అని ఓ ఇరానియన్ సినిమా ఆధారంగా తాను అంతపురం చిత్రం తీసానంటూ...నాట్ వితౌట్ మై డాటర్ ..డాక్టర్ బెట్టీ అనే అమెరికన్ మహిళ యధార్ధగాధ ఇది.ఆ రోజుల్లో చాలా పాపులర్. ఈ సినిమా చాలా మందికి నచ్చింది. యసుధగారు, శ్రీదేవి, కృష్ణారెడ్డి, భరద్వాజ ఇలా చాలా మంది దగ్గర ఈ సినిమా ఫైల్ ఉండేది. హీరోయిన్ దుబాయి వెళ్తుందనీ ఇంకెక్కడికో వెళ్తుందనీ..తలోరకంగా రాసుకున్నారు.నా మైండ్ లో కూడా అలా ఉండిపోయింది. తర్వాత కొద్ది రోజులకే పరిటాలరవి మీద హత్యాయత్నం జరిగింది. ఠక్ మని ఆలోచన వచ్చింది. ఆ సినిమాని రాయలసీమ ముఠాకక్షల నేపధ్యంలో చేస్తే బాగుంటుందని కదా. ఐడియా చెప్పగానే భరధ్వాజ ఎగిరి గంతేసారు. రేయ్ ఈ సినిమా నేను కూడా చూసాను.కానీ నీలాగా ఆలోచించలేకపోయాను,బ్రహ్మాండంగా ఉందిరా,మనం చేస్తున్నాం ఈ సినిమాని అన్నారు. అయితే అంతపురానికి అందరి ప్రశంలూ వచ్చాయి కానీ..డబ్బులు రాలేదు.


Click it and Unblock the Notifications











