twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రజల్లోకి విజయ్ దేవరకొండ.. రెండుచోట్ల బహిరంగ సభలు.. అనుమానాలకు మరింత బలం!

    |

    Recommended Video

    NOTA Public Meetings In Vijayawada And Hyderabad

    సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాజకీయ కథా నేపథ్యంగా తెరకెక్కుతున్న నోటా ప్రమోషన్‌ను నిర్మాతలు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతోపాటు, సత్యరాజ్, నాజర్, మహ్రీన్ ఫిర్జాదా, ప్రియదర్శి నటిస్తున్నారు. ఇరు మురుగన్ ఫేం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 5న రిలీజ్ కానున్నది. నోటా ప్రచారం ఎలా నిర్వహించనున్నారంటే..

    రొమాన్స్ చేయడానికి ఆమె కావాలి.. ఆ హీరోయిన్ తీసుకురమ్మని విజయ్ దేవరకొండ!రొమాన్స్ చేయడానికి ఆమె కావాలి.. ఆ హీరోయిన్ తీసుకురమ్మని విజయ్ దేవరకొండ!

    విజయవాడ, హైదరాబాద్‌లో నోటా ప్రచారం

    విజయవాడ, హైదరాబాద్‌లో నోటా ప్రచారం

    నోటా సినిమా ప్రమోషన్‌లో భాగంగా రెండు బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నారు. ఒక సభను హైదరాబాద్‌లో, మరో సభను విజయవాడలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ది నోటా పబ్లిక్ మీట్ అనే పేరుతో సెప్టెంబర్ 30న విజయవాడలో, అక్టోబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు నిర్మాతలు ఓ ప్రకటనలో తెలిపారు.

     నోటా ప్రమోషన్స్‌పై అనుమానాలు

    నోటా ప్రమోషన్స్‌పై అనుమానాలు

    నోటా మూవీ ప్రమోషన్స్ చాలా దారుణంగా జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. తమిళ, తెలుగు భాషల్లో కూడా సరైన ప్రమోషన్స్ నిర్వహించడం లేదని అభిమానులు భగ్గుమన్నారు. విజయ్ దేవరకొండ నటించిన గత చిత్రం గీత గోవిందంకు గీతా ఆర్ట్స్ అద్భుతమైన ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. కానీ 'నోటా' విషయంలో అలాంటి ప్రమోషన్స్ జరగడం లేదు అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సరికొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారని వాదన వినిపించింది.

    నోటా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన

    నోటా చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఇటీవల విడుదలైన పాటకు కూడా యూట్యూబ్‌ రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి. గీతా గోవిందం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నోటా వస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

     అక్టోబర్ 5న రిలీజ్

    అక్టోబర్ 5న రిలీజ్

    ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ వారు నిర్మించిన నోటా సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ మూవీలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రిగా కనిపిస్తారు. ఈ చిత్రానికి శంతన కృష్ణన్ రవిచంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా, శామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు.

    English summary
    ‘NOTA’ is a political drama featuring Vijay Deverakonda, Sathyaraj, Nasser and Mehreen in the lead roles. The producers of ‘NOTA’ movie are going to kick-start the promotions in a unique way. They would be hosting two public meetings in Vijayawada and Hyderabad on September 30th and October 1st respectively. They have called have it “THE NOTA PUBLIC MEET.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X