Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రజల్లోకి విజయ్ దేవరకొండ.. రెండుచోట్ల బహిరంగ సభలు.. అనుమానాలకు మరింత బలం!
Recommended Video
సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాజకీయ కథా నేపథ్యంగా తెరకెక్కుతున్న నోటా ప్రమోషన్‌ను నిర్మాతలు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతోపాటు, సత్యరాజ్, నాజర్, మహ్రీన్ ఫిర్జాదా, ప్రియదర్శి నటిస్తున్నారు. ఇరు మురుగన్ ఫేం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 5న రిలీజ్ కానున్నది. నోటా ప్రచారం ఎలా నిర్వహించనున్నారంటే..
రొమాన్స్ చేయడానికి ఆమె కావాలి.. ఆ హీరోయిన్ తీసుకురమ్మని విజయ్ దేవరకొండ!
విజయవాడ, హైదరాబాద్‌లో నోటా ప్రచారం
నోటా సినిమా ప్రమోషన్లో భాగంగా రెండు బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నారు. ఒక సభను హైదరాబాద్‌లో, మరో సభను విజయవాడలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ది నోటా పబ్లిక్ మీట్ అనే పేరుతో సెప్టెంబర్ 30న విజయవాడలో, అక్టోబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు నిర్మాతలు ఓ ప్రకటనలో తెలిపారు.
నోటా ప్రమోషన్స్‌పై అనుమానాలు
నోటా మూవీ ప్రమోషన్స్ చాలా దారుణంగా జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. తమిళ, తెలుగు భాషల్లో కూడా సరైన ప్రమోషన్స్ నిర్వహించడం లేదని అభిమానులు భగ్గుమన్నారు. విజయ్ దేవరకొండ నటించిన గత చిత్రం గీత గోవిందంకు గీతా ఆర్ట్స్ అద్భుతమైన ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. కానీ 'నోటా' విషయంలో అలాంటి ప్రమోషన్స్ జరగడం లేదు అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సరికొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారని వాదన వినిపించింది.
నోటా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన
నోటా చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఇటీవల విడుదలైన పాటకు కూడా యూట్యూబ్ రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి. గీతా గోవిందం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నోటా వస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అక్టోబర్ 5న రిలీజ్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ వారు నిర్మించిన నోటా సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ మూవీలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రిగా కనిపిస్తారు. ఈ చిత్రానికి శంతన కృష్ణన్ రవిచంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా, శామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు.