twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె "చిల్లర" మనిషి, మిస్ వరల్డ్ మీద శశీథరూర్ ట్వీట్: బూతులు తిడుతున్నారు

    17 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ వరల్డ్ కిరీటం తీసుకొచ్చిన మానుషి చిల్లార్‌ను ‘చిల్లర’గా పోల్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    |

    Recommended Video

    Miss World 2017 Manushi Chhillar : మిస్ వరల్డ్ పై 'చిల్లర' వ్యాఖ్యలు | Oneindia Telugu

    హరియాణాలో పుట్టిన ఈ యువతి వైద్య విద్యను అభ్యసిస్తూనే ఇప్పుడు ప్రపంచం మెచ్చిన అందగత్తె అయింది. 17 ఏళ్ల తర్వాత విశ్వసుందరి కిరీటాన్ని భారత్‌కు అందించింది. ప్రపంచంలో గొప్ప వృత్తి ఎవరిదని అడిగితే నేను ఏమాత్రం తడుముకోకుండా అమ్మేనని బదులిస్తా.. ప్రపంచ సుందరి పోటీల్లో భారత ప్రతిష్ట నిలబెట్టిన మానుషి చిల్లార్ చెప్పిన మాట ఇది.

    మిస్ వరల్డ్ 2017

    మిస్ వరల్డ్ 2017

    తనకు చిన్ననాటి నుంచే అమ్మంటే అమితమైన ప్రేమ అని, నాన్న కంటే ఆమెతోనే సాన్నిహిత్యం ఎక్కువని ఆమె చెప్పింది. తనకు స్ఫూర్తి తన తల్లేనని ఆమె తెలిపింది. చైనాలోని సన్యా నగరంలో అట్టహాసంగా జరిగిన వేడుకల్లో మానుషి చిల్లార్ 108 మంది వనితలను వెనక్కినెట్టి ‘మిస్ వరల్డ్ 2017' టైటిల్ చేజిక్కించుకుంది.

     మానుషి చిల్లార్‌

    మానుషి చిల్లార్‌

    పలు దశల పోటీల్లో ఆమె ఆద్యంతం.. తన మాటలు, చేతల ద్వారా ఎంతో పరిణతి కనబరిచింది. టైటిల్ సాధించిన అనంతరం కూడా అంతే పరిణతి, ఆత్మ విశ్వాసంతో మాట్లాడి అందరి మనసులను కొల్లగొట్టింది. మానుషి చిల్లార్‌పై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

     ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది

    ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది

    "మన కరెన్సీని రద్దు చేయడం ఎంత పెద్ద తప్పో బీజేపీ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. మన ‘చిల్లర'కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని ‘చిల్లర్' ప్రపంచ సుందరిగా ఎన్నిక కావడంతో రుజువైంది'' అని వివాదాస్పద ట్వీట్ చేశారు శశి థరూర్. 17 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ వరల్డ్ కిరీటం తీసుకొచ్చిన మానుషి చిల్లార్‌ను ‘చిల్లర'గా పోల్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    జాతీయ మహిళా కమిషన్

    జాతీయ మహిళా కమిషన్

    ఇవి ఆయన చిల్లర వ్యాఖ్యలకు నిదర్శనమని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మరోవైపు థరూర్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మానుషి ఘనతను తక్కువ చేసి చూపినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

     జాట్లు మండిపడుతున్నారు

    జాట్లు మండిపడుతున్నారు

    సమన్లు జారీ చేసేందుకు సిద్ధమైంది. కాగా, థరూర్ వ్యాఖ్యలపై జాట్లు మండిపడుతున్నారు. ఆమె జాట్ కమ్యూనిటీకి చెందినదని, ఆమెను అవమానించడమంటే జాట్లను అవమానించడమేనని అను త్రివేది అనే ట్విట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    English summary
    "What a mistake to demonetise our currency! BJP should have realised that Indian cash dominates the globe: look, even our Chhillar has become Miss World!," Tharoor tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X