»   » శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంతో...‘రావణ దేశం’

శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంతో...‘రావణ దేశం’

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: శ్రీలంక ప్రభుత్వానికి, తమిళులకు మధ్య ఏళ్ల తరబడి సాగిన అంతర్యుద్ధం ఎల్టీటీఈ వర్గాలు లంక సైన్యం చేతిలో హతమవడంతో ముగిసిన సంగతి తెలిసిందే. అంతర్యుద్ధం సమయంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంతో సినిమా రాబోతోంది.

దర్శకుడు అజయ్ నూతక్కి దర్శకత్వంలో 'రావణ దేశం' పేరుతో ఈచిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ...శ్రీలంకలో జరిగిన అంతర్యుద్దంలో తప్పిపోయిన శరణార్థుల కథాంశంతో 'రావణ దేశం' తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో ఈచిత్రాన్ని వివాద రహతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.

Ravana Desam

ఈ సినిమా ఎవరికీ అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా ఉండబోదని, 2009లో శ్రీలంకలో జరిగిన అంతర్యుద్ధంలోని కొన్ని వాస్తవ సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని ఈచిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ చిత్రం చూసిన ప్రేక్షకుడు ఆ నాటి సంఘటనలకు ఎవరో ఒకరు బాధ్యులని భావిస్తాడని తెలిపారు.

ఆచూకీ తెలియకుండా పోయిన శరణార్థుల అంశంపై సినిమాలో ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలిపారు. 'రావణ దేశం' చిత్రంలో జన్నీఫర్, రమేష్ హీరో హీరోయిన్లు. న్యూ అంఫైర్ సెల్యూలాయిడ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం ఈ చిత్రం విడుదల కాబోతోంది.

English summary
Debutant director Ajay Nuthakki has reinforced that there is absolutely nothing controversial in the forthcoming bilingual Tamil-Telugu political-drama "Ravana Desam", which is based on the refugees missing during the 2009 civil war in Sri Lanka.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu