వీర్ కానీ వీర్: సల్మాన్ ఖాన్

By Sindhu

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ సుమారు 20 ఏళ్ల క్రితం ఓ కథ రాసుకున్నారు. ప్రేమకోసం బ్రిటిష్‌ వారిని ఎదిరించిన ఓ మగధీరుడి కథ ఇది. దీన్ని సరిగ్గా తెరకెక్కించే దర్శకుడి కోసం చాలా కాలంగా ఎదురుతెన్నులు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆయన నిరీక్షణ ఫలించి 'గదర్‌' సినిమా అనిల్‌ శర్మ తారసపట్టారు. అంతే ఆ కథను ఆయన చేతిలో పెట్టారు. అలా తెరకెక్కిన చిత్రమే 'వీర్‌'. ఇందులో యుద్ధవీరుడుగా సల్మాన్‌ నటించగా, అతని సరసన జరీన్‌ఖాన్‌ అనే నూతన నటి పరిచయమవుతోంది. ఎరోస్‌ సంస్థ 55 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది.యుద్ధ వీరుడి పాత్ర కోసం సల్మాన్‌ ఎంతో శ్రమించి తన శరీరాకృతిని మలుచుకున్నారు. చిత్ర రచనలో కూడా సల్మాన్‌ పాల్గొన్నారు. చారిత్రక కథ కావడంతో సెట్స్‌కు భారీ ఖర్చు చేశారు. ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, సోహైల్‌ ఖాన్‌, జాకీ శరాఫ్‌ వంటి ప్రముఖ తారాగణం నటించారు. సాహిజ్‌ వాజిద్‌ స్వరపరిచిన బాణీలకు ఇప్పటికే మంచి పాపులారిటీ లభించింది. హీరోగానే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన రచనలోనూ సల్మాన్‌ పాల్గొని ఈ చిత్రంపై అంచనాలు మరింత పెంచాడు.

అమ్మాయిల కలల రాకుమారుడు, కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ యుద్ధవీరుడిగా ఈ చిత్రంలో బాగా నటించాడు. ఈ చిత్రం కోసం ఎన్నో రోజులు శ్రమించి తన శరీర ఆకృతిని యోధుని వలె తీర్చిదిద్దాడు సల్మాన్‌ సిక్స్‌ప్యాక్‌ బాడితో మరింత ఆకర్షణీయంగా సల్మాన్‌ ఈ చిత్రంలో చూడముచ్చటగా కన్పిస్తున్నాడు. అంతేకాకుండా కళ్ళు చెదిరే గ్రాఫిక్స్‌ని సైతం ఈ చిత్రం కోసం వినియోగించారు. 1825లో బ్రిటీష్‌ వారు పరిపాలించే కాలంలో ఇండియాలో జరిగిన ప్రేమకథే ఈ చిత్రం ''ప్రేమించిన యువరాణి గురించి బ్రిటీష్‌ వారిని ఎదిరించే మగధీరునిగా'' సల్మాన్‌ఖాన్‌ అభినయం ఈ చిత్రానికి హైలెట్‌ గా నిలిచింది. ఇకపోతే...ఈ చిత్రంలో సల్మాన్ కొత్త హెయిర్ స్టైల్ అభిమానులు బాగా ఆకట్టుకొన్నది . గ్రీకు పౌరాణిక యోధుడికి సంబంధించిన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో గ్రీకు వీరుడు లాంటి వస్త్రధారణలో చేతికి గాజులు వంటివి తొడిగి ప్రత్యేక గెటప్‌లో సల్మాన్ ఖాన్ అభిమానులను ఆకర్షితులను చేశారు. ముఖ్యంగా 2009లో అసాధారణ విజయం సాధించిన 'మగధీర" చిత్రంతో ఈ చిత్రానికి చాలా దగ్గర పోలికలు వున్నాయనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X