నేను అన్నదాంట్లో తప్పులేదు...రామ్ చరణ్
ఇప్పటికే దాసరిని ఉద్దేశించి రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు అంతటా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపధ్యంలో తన కామెంట్స్ ని సమర్ధించుకుంటూ చరణ్ ఇలా అన్నారు...యువతరం తమ అభిప్రాయాల్ని వెల్లడించే సమయంగా దీన్ని భావిస్తున్నాను. ఓపెన్ గా మాట్లాడటంతో తప్పులేదు. ఎవరో ఒకరు దీన్ని ప్రారంభించాలి. అది నేను చేసాను. మా నాన్న సీనియర్ హీరో ఆయన ఇలాంటి విషయాల్లోకి రారు.ఆయన ఎప్పుడూ యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూంటారు. కొంతమంది సీనియర్స్ మాత్రమే దీనికి విరుద్దంగా ఉంటారు అన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్..సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రం చేస్తున్నారు. తమన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











