»   »  వర్మా...ఇదేమి కర్మ

వర్మా...ఇదేమి కర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu
రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమనేది ఒకప్పటి మాట.ఇప్పుడు ఏం చేసినా కేసు అవుతోంది.తాజాగా టీ సిరీస్‌ సంస్థను మోసగించిన కేసులో వర్మ నోయిడా పోలీసుల నుండి నోటీసులు అందుకున్నాడు. వర్మ కార్పోరేషన్ ద్వారా తాను నిర్మించే 14 చిత్రాలకు ఆడియో, వీడియో రైట్స్‌ ఇస్తానని 2006లో టీ సిరీస్‌ వారి సూపర్‌ కాసెట్స్‌ ఇండస్ట్రీస్‌తో వర్మ ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. కోటిన్నర రూపాయలు అడ్వాన్స్‌ తీసుకున్నాడు.ఇప్పుడు వర్మ ఇవన్నీ ప్రక్కకు పెట్టి యాడ్‌లాబ్స్‌కు హక్కులు ధారాదత్తం చేసాడట. దాంతో వారు లీగల్ యాక్షన్ కి దిగారుట. ఓ ప్రక్క వరస ఫ్లాపులుతో దిగజారుతున్న వర్మ ఫ్యాక్టరీకి ఇది గోరు చుట్టు మీద రోకలి పోటు లాంటిది అంటున్నారు అనుభవశాలులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X