కొత్త బంగారు లోకం చిత్ర నిర్మాత దిల్ రాజ్ చిక్కుల్లో పడ్డారు. దిల్ రాజ్ కు పురావస్తు శాఖ నోటీసులు జారీ చేసింది. విశాఖపట్నం సమీపంలోని బావికొండ బౌద్ధ క్షేత్రంలో అనుమతి లేకుండా కొత్త బంగారు లోకం చిత్రంలోని ఒక పాటను చిత్రీకరించారని పురావస్తు శాఖ ఈ నోటీసు జారీ చేసింది. బౌద్ధులు అత్యంత పవిత్రంగా భావించే క్షేత్రంలో అశ్లీల నృత్యాలు చిత్రీకరించారని ఆరోపిస్తూ ఇంటాక్ అనే స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో ముందుగా పురావస్తు శాఖ అనుమతి తీసుకున్నామని దిల్ రాజ్ అబద్ధమాడినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త బంగారు లోకం వివాదంలో చిక్కుకుంది.