ఆ పాటకున్న క్రేజ్ తోనే ఐటమ్ సాంగ్ కి అనుష్క ఓకే..!?
అగ్ర కథానాయికలు ఐటమ్ సాంగ్స్‌లో నర్తించి అలరించడం ఇప్పుడు భారతీయ సినిమాలో ఓ ట్రెండ్ గా మారింది. అంతేకాదు వాణిజ్య పరంగా సినిమాని గట్టెక్కించే ఓ బ్రహ్మాస్త్రంలా ఈ ప్రత్యేకగీతాలు మారిపోయాయి. 'తీస్ మార్ ఖాన్" చిత్రంలో 'షీలాకీ జవానీ" అంటూ కత్రినాకైఫ్ కుర్రకారుని ఉర్రూతలూగించింది. ఆ సినిమాతో ఐటమ్ సాంగ్ కున్న పవర్ ఏంటో దర్శకనిర్మాతలకు తెలిసివచ్చింది. సల్మాన్ ఖాన్ నటించిన మాస్ ఎంటర్ టైనర్ 'దబాంగ్" చిత్రంలో మలైకా అరోరా చేసిన 'మున్నీ బద్నామ్ హుయి" పాట చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. సినిమా విజయంలో కూడా ఆ పాట కీలక పాత్ర పోషించింది.
తాజాగా ఈ చిత్రానికి తెలుగు రీమేక్ గా పవన్‌కల్యాణ్ నటిస్తున్న 'గబ్బర్ సింగ్" తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే 'దబాంగ్"లో 'మున్నీ బద్నామ్ హుయి" పాటకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు హరీష్ శంకర్ 'గబ్బర్ సింగ్"లో కూడా అదే తరహాలో ఓ పాట వుంటే బాగుంటుందనే ఆలోచనలో వున్నాడట. దీంతో ఆయన అనుష్కను సంప్రదించారని, భారీ రెమ్యునరేషన్ తో ఆ పాటకున్న క్రేజ్ తో ఆ పాటలో నర్తించడానికి అనుష్క ఓకే చేసిందని ఫిల్మ్‌నగర్ సమాచారం. గతంలో 'స్టాలిన్" చిత్రంలో మెగాస్టార్ సరసన ఐటమ్‌సాంగ్ చేసిన అనుష్క ఇప్పుడు పవన్‌తో ఐటమ్‌సాంగ్ చేయబోతుండటం సినీ వర్గాలు విశేషంగా చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











