45 లక్షలతో దొరికిపోయి అదికారుల నిర్భందంలో స్టార్ హీరోయిన్
బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మను ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నిన్న(సోమవారం) సాయింత్రం అదుపులోకి తీసుకున్నారు. ఆమె తన వద్ద అక్రమంగా బంగారు నగలు ఉంచుకున్నారని అధికారులు అభియోగం. వాటి విలువ 45 లక్షలు ఉంటుందని చెప్తున్నారు. ఇంతకుముందు బాలీవుడ్ లోని మరో హీరోయిన్ మనీషా లంబా కూడా ఇలాగే పట్టుబడింది. ఆ తర్వాత పన్ను కట్టి బయిటపడింది. ఇప్పుడు అనుష్క శర్మ ఏ రకంగా బయటపడుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కెనడాలోని టొరంటో నగరంలో జరిగిన సిని అవార్డుల ఉత్సవంలో ఈమె పాల్గొని తిరిగి వస్తున్నారు. అయితే తన వద్ద ఏఏ నగలు ఉన్నవి, పరిమితి ఉంచి నగలు ఉన్న పక్షంలో తెలియచేసి, దానికి సంబందించి రశీదులు చూపితే ఇబ్బంది ఉండదు.తాము స్టార్స్ మి కదా మనల్ని ఎవరూ పట్టుకోరులే అనే ధైర్యంతో వచ్చి ఈ హీరోయిన్స్ దొరికిపోయి ఇలా ఇబ్బంది పడుతున్నారు.


Click it and Unblock the Notifications











