twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ 'బాషా' అనుభవాలు పుస్తకం ఇదే

    By Srikanya
    |

    చెన్నై : 'బాషా ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే...' ఈ పాపులర్ డైలాగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ 'బాషా' చిత్రంలోనిది అని కొత్తగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. 1995లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అప్పట్లో భారీ విజయం సాధించింది. రజనీకాంత్ సీని చరిత్రలో ఈ చిత్రం ఓ మైలురాయి. ఈచిత్రంలో రజనీ మేనరిజం, స్టైల్ అదుర్స్ అంటూ చాలా మంది ఆయనకు అభిమానులైపోయారు. - హీరోయిజాన్ని స్పష్టం చేసే సంభాషణ ఇది.

    రజనీకాంత్‌ నటించిన 'బాషా' చిత్రంలోని ఈ పంచ్‌ డైలాగ్‌ని ప్రేక్షకులు మరచిపోలేరు. 1995లో వచ్చిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఇప్పటికీ ఆ చిత్ర కథన శైలి నుంచి స్ఫూర్తి పొందుతుంటారు రచయితలు. ఆ సినిమాకి సురేష్‌కృష్ణ దర్శకుడు. ఆయన 'బాషా' చిత్ర అనుభవాలకు అక్షర రూపమిచ్చారు. ఆంగ్ల, తమిళ, తెలుగు భాషల్లో పుస్తకాన్ని విడుదల చేస్తారు. ఆంగ్లంలో ఆ పుస్తకానికి 'మై డేస్‌ విత్‌ బాషా' అనే పేరుని నిర్ణయించారు. నవంబరులో ఇది పాఠకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది.

    ప్రస్తుతం రజనీకాంత్ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' చిత్రంలో నటిస్తున్నాడు. ఓ దుష్టశక్తి బారి నుంచి ప్రపంచాన్ని రక్షించే పోరాట యోధుడిగా రజనీకాంత్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన 30 ఏళ్ల యువకుడిగా కనిపిస్తాడు. ఆయన తక్కువ వయసు వాడిలా కనిపించడం కోసం అధునాతన టెక్నాలజీని వాడుతున్నారట.

    ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందించనున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడు. తెలుగులో ఈ చిత్రాన్ని లక్ష్మి గణపతి ఫిలింస్‌ పతాకంపై బి.సుబ్రహ్మణ్యం అందిస్తున్నారు. తమిళ్‌, హిందీ, తెలుగు భాషలలో ఒకేసారి అంటే దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌కి 'విక్రమ్‌ సింహా' అనే టైటిల్‌ని నిర్మాతలు పరిశీలిస్తున్నారనేది తాజా సమాచారం. శోభన, శరత్‌కుమార్‌, జాకీ ష్రాప్‌, నాజర్‌ ..ఇలా భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిన సంగతి తెలిసిందే. రజనీకాంత్‌ విభిన్న అవతారంలో కనిపించే పోస్టర్లు ఇప్పటికే అభిమానులు సహా ప్రేక్షకుల్లో వైబ్రేషన్‌ క్రియేట్‌ చేశాయి.

    English summary
    Baasha was one of the biggest hits in superstar Rajnikanth's career. Now, the film's director Suresh Krishna is bringing out a book on this film. Titled My days with Baasha, the book talks about at length about the making of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X