భన్వరీదేవిపై సినిమాలో మల్లికా, బిపాసా?
బాలీవుడ్ సెక్స్ బాంబులు మల్లికా షెరావత్, బిపాసా బసు, విద్యాబాలన్ లతో బాలీవుడ్ నిర్మాత మహేంద్ర దరివాల్ మంతనాలు జరుపుతున్నారు. అప్పట్లో సంచలనం సృష్టించిన నర్స్ బన్వరిదేవి హత్యపై, ఆమె జీవితంలోని ఆసక్తికర అంశాలపై సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడు ఈ నిర్మాత. ఈచిత్రానికి 'అజబ్ బన్వరికి గజబ్ కహాని' అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఇప్పటికే టైటిల్ రిజిస్టర్ చేయించారు. మరి బన్వరి దేవి పాత్ర చేయడానికి ఈ ముగ్గురు భామల్లో ఎవరు ఒప్పుకుంటారనేది ఖరారు కావాల్సి ఉంది. మహేంద్ర దరివాల్ గతంలో మా తుజే సలాం, నహ్లె పె దెహ్లా చిత్రాలను నిర్మించారు.
బిపాస ప్రపస్తుతం ప్రేయర్స్, జోడీ బ్రేకర్స్, రాజ్ 3డి, రేస్2 చిత్రాల్లో నటిస్తోంది. డర్టీ పిక్చర్ ద్వారా ఇటీవలే భారీ విజయం సొంతం చేసుకున్న విద్యా బాలన్ ప్రస్తుతం 'కహాని'అనే చిత్రంలో నటిస్తోంది. మార్చి 9న ఈ చిత్రం విడుదల కానుంది. మల్లికా షెరావత్ వివేక్ ఒబెరాయ్ తో జంటగా 'కిస్మత్ లవ్ పైసా దిల్లి' అనే చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











