బూతు భామ జీవితంపై సినిమా!
బూతు మార్గంలో పయనించి తనదైన రీతిలో పబ్లిసిటీ సంపాదించుకుంది పూనమ్. ట్విట్టర్లో చేరిన ప్రధానికి బికినీతో వెల్ కం చెప్పింది. గతంలోనూ పూనమ్ పాండే టీమిండియాను ఎంకరేజ్ చేయడానికి అంటూ ఇలాంటి బికినీ ఫోటోలను పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా పూనమ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మీరు కప్ప తెస్తే....బట్టలన్నీ విప్పేసి నగ్నంగా కను విందు చేస్తా అంటూ సంచలనం సృష్టించింది. కప్పు గెలిచినా ఏవో కుంటి సాకులు చెప్పి విప్పకుండా తప్పుకుంది ఈ అమ్మడు.
మన దేశ జనాల్లో రోజు రోజుకు బూతుపై మోజు పెరిగి పోతోందనడానికి నిదర్శనంగా.... శృంగార సంబంధమైన విషయాలపై మక్కువ మరీ ఎక్కువవుతోందనడానికి తార్కానంగా పూనమ్ పాండే, సన్నీలియోన్ లాంటి బరితెగింపు భామలకు పాపులారిటీ కూడా బాగా పెరిగి పోతోంది. వీళ్ల జోరుకు బాలీవుడ్ టాప్ హీరోయిన్లు కూడా వెనకబడి పోతున్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. గూగుల్ సెర్చిలో వీరే టాప్.
పరిస్థితి ఇలా ఉండబట్టే... బూతును క్యాష్ చేసుకోవడానికి సినిమా దర్శకులు, నిర్మాతలు కూడా ఇలాంటి అలాంటి భామలను ప్రోత్సహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వారితో సినిమాలు చేస్తున్నారు. వెరసీ మన సినిమాల్లో బూతు రాజ్యమేలుతోంది.


Click it and Unblock the Notifications












