ఇక ఐశ్వర్య రాయ్ ని ఇష్టపడితే కొరుక్కుని తినేయొచ్చు...
ఇకనుంచి చక్కగా ఐశ్వర్య రాయ్ ను కొరుక్కు తినొచ్చు అంటున్నారు పద్మశ్రీ హజీ ఖలీముల్లా ఖాన్.ఆయన డవలప్ చేసిన ఓ జామపండుకి ఐశ్వర్యారాయ్ పేరు పెట్టారు. అలాగే ఆ జామపండు చూడగానే తినాలనిపించే కలర్ తో మంచి జ్యూస్ తో ఉంటుంది. అందుకే తనకి ఇష్టమైన నటి పేరు ఆ జామపండుకి పెట్టేసారు. దాంతో ఆ జామపండుకి భారిగా డిమాండ్ వచ్చేసింది. ఇంతకుముందు కూడా ఖలీముల్లా ఓ ప్రత్యేకమైన మామిడి పండ్లను పండించారు. అప్పట్లో వాటికి ప్రముఖ క్రికెటెర్ సచిన్ టెండూల్కర్ పేరు పెట్టారు. అదే స్పూర్తితో ఇప్పుడు ఐష్ అని పెట్టారు. ఇంకా భవిష్యత్ లో ఎవరెవరు పేర్లు ఆయన పెట్టనున్నారో అంటున్నారు. ఇక ఐశ్వర్య రాయ్...2010లో కంటిన్యూగా ది రావణ్, రోబో, గుజారిష్, యాక్షన్ రీప్లే వంటి భారీ చిత్రాలు చేసింది. ఈ కొత్త సంవత్సరంలో ఒక్క చిత్రం కూడా కమిట్ కాలేదు.


Click it and Unblock the Notifications











